కోటరీల చేతుల్లో చిక్కుకుంటున్న ఏపీ సీఎంలు

AP CMs Are Caught In The Hands Of Coteries, AP CMs Are Caught, Hands Of Coteries AP CMs, Hands Of Coteries, AP Chief Ministers, Chandrababu, Jagan, AP CMs, Coteries, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
AP Chief Ministers,Chandrababu, Jagan, AP CMs,coteries

ఏపీలో ముఖ్యమంత్రి  హోదాలో ఎవరున్నా వారి చుట్టూ కమ్ముకునే కోటరీ వ్యవస్థలతో..  ప్రజలకు దూరమవ్వడం ఏపీలో సాధారణం అయిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  అప్పుడు రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..ఆ తర్వాత వచ్చిన జగన్ మోహన్ రెడ్డి కూడా కోటరీల విషయంలో బాబు బాటలోనే నడిచారనే అపవాదు ఉంది.

2014లో సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక.. రెండేళ్ల పాటు హైదరాబాద్‌-విజయవాడ మధ్య పాలన సాగింది. 2015 మే తర్వాత ఏపీకి  రాజధాని తరలించాలనే నిర్ణయం తీసుకోవడంతో.. అమరావతిలో రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. అలా 2014-19 మధ్య కాలంలో ఓ కోటరీ గుప్పెట్లో చంద్రబాబు చిక్కుకోవడంతో ప్రజలకు దూరం అయ్యారన్న  అపవాదు ఉంది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తమకు నమ్మకంగా ఉన్నవారిని.. సలహాదారుల పదవులు ఇచ్చి దగ్గర ఉంచుకోవడం ఏపీలో రివాజుగా మారింది. కానీ అదే సలహాదారుల చెప్పుచేతల్లోకి  ముఖ్యమంత్రులు వెళ్లిపోతున్నారు. అప్పుడు చంద్రబాబు అయినా ఇప్పుడు జగన్ అయినా  ఒకటే సీన్. సీఎం ఎవరితో మాట్లాడాలన్న విషయం దగ్గర నుంచి , ఎవరెవరిని కలవాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి వంటి చిన్న చిన్న అంశాల్లో మితిమీరిన ఆంక్షలు అమలు చేస్తూ ఈ కోటరీలే కీలకం అన్నట్లుగా తయారు చేసుకుంటున్నారు.

కాకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సీఎం కొలువుండే సెక్రటేరియట్‌ బ్లాక్‌లో అందరిని అనుమతించే వారు. సీఎం కార్యాలయం ఉన్న ఫస్ట్‌ ఫ్లోర్‌కు  పరిమితమైన ఎంట్రీ ఉండటంతో..  ప్రెస్‌ మీట్ జరిగినపుడు మీడియాకు అనుమతి ఉండేది.కానీ జగన్ బాధ్యతలు చేపట్టాక ఫస్ట్‌ బ్లాక్‌లోకి ప్రవేశాలను పూర్తిగా నిషేధించారు.

చంద్రబాబు హయాంలో సీఎంఓలో చక్రం తిప్పిన అధికారులు ఆ తర్వాత జగన్ హయాంలో కూడా సీఎం పేషీకి దగ్గరయి.. కీలక పోస్టింగులు కూడా దక్కించుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎవరైనా సరే సీఎంను ప్రశ్నించే అవకాశం ఉండేది. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక  సొంత మీడియాలో కూడా నేరుగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు కనిపించలేదు.

మొత్తంగా సీఎం పదవిలో ఉండగా చంద్రబాబు,ఇప్పుడు సీఎంగా ఉన్న  జగన్ అవసరానికి మించి సలహాదారులపై ఆధారపడటం వల్లే కోటరీ పెత్తనం పెరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా పర్యావసానాలు ఆలోచించకుండా కోటరీలను ప్రోత్సహించడంలో వీరిద్దరూ పోటీ పడ్డారనే ప్రచారం కూడా ఏపీ అధికార వర్గాల్లో ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =