క్రిమియా వంతెనను సందర్శించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌

Russia President Vladimir Putin Visited Crimea Bridge Drove a Mercedes Across the Bridge,Russian President Vladimir Putin,Putin Visited Crimea Bridge,Vladimir Putin,Mango News,Mango News Telugu,Russia President Vladimir Putin,Crimea Bridge,Crimea Bridge Visit,Crimea Bridge Visit By Vladimir Putin,Vladimir Putin Latest News and Updates,Vladimir Putin News and Live Updates,Russian President,Russian President Crimea Bridge Visit,Russia President Visits Crimea Bridge,Russia President,

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సోమవారం క్రిమియా వంతెనను సందర్శించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవల బాంబుదాడిలో క్రిమియా వంతెన పాక్షికంగా ధ్వంసమైన విషయం తెలిసిందే. వ్లాదిమిర్ పుతిన్‌ స్వయంగా మెర్సిడెస్‌ బెంజ్‌ కారును నడుపుతూ, క్రిమియా వంతెనపై ప్రయాణించారు. ఈ సందర్భంగా పుతిన్ తో పాటుగా రష్యా ఉప ప్రధానమంత్రి మరాత్ ఖుస్నుల్లిన్ కూడా ఉన్నారు. ఈ దృశ్యాలను రష్యా లోని ఓ టెలివిజన్‌ ప్రసారం చేసింది.

అక్టోబర్ బాంబు పేలుడు అనంతరం మరమ్మత్తులు చేయబడ్డ క్రిమియా వంతెనను పుతిన్ స్వయంగా పరిశీలించి, బిల్డర్లు, నిర్మాణ కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా క్రిమియా వంతెన పునరుద్ధరణ పనుల పురోగతిపై ఉప ప్రధాని మరాత్ ఖుస్నుల్లిన్ పుతిన్ కు నివేదించారు. కాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై గతకొన్ని రోజులుగా పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పుతిన్ తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి పడిపోయి తుంటిఎముక విరిగిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో క్రిమియా వంతెనను పుతిన్ సందర్శించిన దృశ్యాలు ప్రసారం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here