ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

72nd Republic Day, 72nd Republic Day Celebrations Conducted Grandly In Delhi, bjp, BJP Latest News, COVID-19, January 26th, Mango News, modi, New Delhi, PM Modi, PM Modi best speeches, PM Modi Latest News, PM Modi latest speech, PM Modi live, pm narendra modi, PM Narendra Modi Participates In 72nd Republic Day Celebrations, Republic Day, Republic Day 2021, Republic Day Celebrations

దేశ రాజధాని ఢిల్లీలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్‌పథ్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే త్రివిధ దళాల నుంచి రాష్ట్రపతి గౌరవవందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా ఆర్మీ, నేవీ, వైమానిక దళం, పోలీసులు మరియు పారా మిలటరీ దళాల రెజిమెంట్లు రాజ్‌పథ్ మైదానంలో చేసిన కవాతు ఆకట్టుకుంది.

ఇక భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా వివిధ మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన శకటాల ప్రదర్శన అబ్బురపరిచింది. ముందుగా ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటుగా త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here