మాజీ ప్రధాని మహింద రాజపక్సే దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించిన శ్రీలంక కోర్ట్

Sri Lanka Court Bans Ex-PM Mahinda Rajapaksa From Leaving The Country After His Resigns, Ex-PM Mahinda Rajapaksa From Leaving The Country After His Resigns, SL Court Bans Ex-PM Mahinda Rajapaksa From Leaving The Country After His Resigns, Ex-PM Mahinda Rajapaksa, Ex-PM Mahinda Rajapaksa Resigns, Ex-PM Mahinda Rajapaksa Resigns As SL PM, Sri Lanka Court Bans Ex-PM Mahinda Rajapaksa, Sri Lanka court bans former PM Mahinda Rajapaksa, former PM Mahinda Rajapaksa, PM Mahinda Rajapaksa, Mahinda Rajapaksa, Sri Lankan court imposes overseas travel ban For Ex-PM Mahinda Rajapaksa, Sri Lanka banned former Prime Minister Mahinda Rajapaksa and his allies from leaving the country, Sri Lanka Economic Crisis News, Sri Lanka Economic Crisis Latest Nrews, Sri Lanka Economic Crisis Latest Updates, Sri Lanka Economic Crisis Live Updates, Mango News, Mango News Telugu,

శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్సే దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించబడింది. ఆయన మద్దతుదారులు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడినందుకు శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్సేతో పాటు ఆయన రాజకీయ సహచరుడు నమల్ మరియు మరో 15 మంది మిత్రులు దేశం విడిచి వెళ్లకుండా కోర్ట్ ఈరోజు నిషేధం విధించింది. దేశాన్ని అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినందుకు మహింద రాజపక్సే మరియు ఆ దేశ అధ్యక్షుడైన అతని సోదరుడు గోటబయ రాజపక్సే వైదొలగాలని డిమాండ్ చేస్తూ వారాల తరబడి నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. శ్రీలంక ప్రధానమంత్రి పదవికి మహింద రాజీనామా చేసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది.

శాంతియుత నిరసనకారులపై సోమవారం నాటి మూక దాడులు, తొమ్మిది మంది ప్రాణాలను బలిగొన్న, విస్తృత విధ్వంసానికి కారణమైన ప్రతీకార హింసకు దారితీసిన ఘటనపై దర్యాప్తు చేయాలని కూడా కోర్టు పోలీసులను ఆదేశించింది. కాగా ప్రస్తుతం శ్రీలంక తూర్పు తీరంలోని ట్రింకోమలీ నౌకాదళ స్థావరంలో మహింద రాజపక్సే ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తన కార్యనిర్వాహక అధికారాలను చాలా వరకు వదులుకుని ఈ వారంలో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తానని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న తరుణంలో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తన సోదరుడి స్థానంలో కొత్త ప్రధానిని నియమించనున్నారు. కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘేను నియమించాలని అధ్యక్షుడు గోటబయ రాజపక్సే భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 6 =