జీ20 సమ్మిట్‌: ప్రధాని మోదీతో భేటీ తర్వాత, భారతీయులకు శుభవార్త చెప్పిన యూకే పీఎం రిషి సునాక్

UK PM Rishi Sunak Approves 3000 Visas For Indians Hours After Meets PM Modi at G20 Summit in Bali Indonesia,UK PM Rishi Sunak ,3000 Visas For Indians,G20 Summit in Bali Indonesia,Mango News,Mango News Telugu,Modi Unveil Logo G20 Presidency,Modi Unveil Theme G20 Presidency,G20 Presidency Website Launch,PM Narendra Modi Latest News And Updates,PM Narendra Modi, India’s G20 Presidency,G20 Presidency Launch, PM Modi Launch G20 Presidency, G20 Presidency News And Updates, Indian Prime Minister Latest News

ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 సమ్మిట్‌ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని యూకే ప్రధాని రిషి సునాక్ కలిశారు. ఇరుదేశాల మధ్య సుహృద్భావ వాతావరణం మరింత మెరుగు పరిచే అంశాలపై వారిరువురూ కొద్దిసేపు ముచ్చటించారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇక ప్రధాని మోదీతో భేటీ జరిగిన కొన్ని గంటల తర్వాత యూకే ప్రధాని రిషి సునాక్ భారతీయులకు శుభవార్త చెప్పారు. ఇకపై ప్రతి సంవత్సరం యూకేలో పని చేయడానికి భారతదేశం నుండి యువ నిపుణుల కోసం 3,000 వీసాలు అందించే పథకానికి ఆమోదం తెలిపారు. దీనిద్వారా 18–30 సంవత్సరాల వయస్సు గల డిగ్రీ విద్యావంతులైన భారతీయులకు వృత్తిపరమైన మరియు సాంస్కృతిక మార్పిడిలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తుంది.

ఈ వీసాల ద్వారా భారతీయులు యూకేలో రెండేళ్ల వరకు జీవించడానికి మరియు పని చేయడానికి వీలు కలుగుతుంది. ఈ మేరకు యూకే ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ఇక ఈ సదస్సులో పాల్గొన్న సునాక్ మాట్లాడుతూ.. ‘మన భద్రత మరియు మన శ్రేయస్సు కోసం ఇండో-పసిఫిక్ చాలా కీలకమైనది. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో నిండి ఉంది. అలాగే రాబోయే దశాబ్దం ఈ ప్రాంతంలో ఏమి జరుగుతుందో దాని ద్వారా నిర్వచించబడుతుంది’ అని పేర్కొన్నారు. కాగా భారత సంతతికి చెందిన వ్యక్తి తొలి బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన గత నెలలో పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్, ప్రధాని మోదీని కలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =