విజయ్ మాల్యాకు షాక్.. కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో 4 నెలల జైలు శిక్ష విధించిన సుప్రీంకోర్టు

Supreme Court Sentences Vijay Mallya To 4 Months Imprisonment For The Contempt of Court, Vijay Mallya To 4 Months Imprisonment For The Contempt of Court, Supreme Court Sentences Vijay Mallya To 4 Months Imprisonment, 4 Months Imprisonment To Vijay Mallya, Supreme Court Sentences Vijay Mallya, Vijay Mallya, 4 Months Imprisonment, Contempt of Court, Supreme Court, Vijay Mallya Sentenced To 4 Months Jail By Supreme Court For The Contempt of Court, Vijay Mallya Former Member of Rajya Sabha, Former Member of Rajya Sabha, Vijay Mallya Sentenced To 4 Months Jail, Vijay Mallya Sentenced To Jail News, Vijay Mallya Sentenced To Jail Latest News, Vijay Mallya Sentenced To Jail Latest Updates, Vijay Mallya Sentenced To Jail Live Updates, Mango News, Mango News Telugu,

భారతీయ బ్యాంకులకు వేల కోట్లు రుణాలు ఎగవేసిన ఆరోపణలపై పలు కేసులు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త, పరారీలో ఉన్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్‌ మాల్యాకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసు కింద విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది. కోరు ధిక్కారం నేరం కింద జైలు శిక్షతోపాటు, 2 వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే ఆయన కుటుంబానికి చెందిన అకౌంట్లకు అక్రమంగా తరలించిన 40 మిలియన్ డాలర్లను తిరిగివ్వాలని విజయ్‌ మాల్యా కుటుంబ సభ్యులను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2017లో నమోదైన ఈ కేసుకి సంబంధించి సోమవారం సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది.

జరిమానాను నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో అదనంగా మరో రెండు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. అలాగే 40 మిలియన్ డాలర్ల ఆ మొత్తాన్ని 8% వడ్డీతో నాలుగు వారాల్లోగా రికవరీ అధికారికి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోతే విజయ్ మాల్యా ఆస్తులను అటాచ్ చేసుకోవచ్చని అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు యుయు లలిత్, ఎస్ రవీంద్ర భట్ మరియు పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం, ఆఫ్‌షోర్ సంస్థ డియాజియో నుండి అందుకున్న $40 మిలియన్లను డిపాజిట్ చేసేలా విజయ్ మాల్యాను ఆదేశించాలని సుప్రీంకోర్టు కోరింది. కర్నాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ విజయ్ మాల్యా వాస్తవాలను దాచిపెట్టి సొమ్మును తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, కుమార్తెలు లీనా మాల్యా, తాన్యా మాల్యాలకు మళ్లించారని బ్యాంకులు ఆరోపించాయి. కాగా విజయ్ మాల్యా ఇప్పటికే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన ₹ 9,000 కోట్లకు పైగా బ్యాంక్ లోన్ డిఫాల్ట్ కేసులో నిందితుడు.ఈ ఆరోపణలు, కేసుల నేపథ్యంలో అతను యునైటెడ్ కింగ్‌డమ్‌కు పారిపోయాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − one =