రాష్ట్రంలో వానలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

CM KCR Held High Level Review on the Situation of Rains and Floods in the State, Telangana CM KCR Held High Level Review on the Situation of Rains and Floods in the State, KCR Held High Level Review on the Situation of Rains and Floods in the State, CM KCR Held High Level Review on the Situation of Rains in the State, KCR Held High Level Review on the Situation of Floods in the State, Review on the Situation of Rains and Floods in the State, Telangana CM KCR Held High Level Review, Telangana Rains and Floods News, Telangana Rains and Floods Latest News, Telangana Rains and Floods Latest Updates, Telangana Rains and Floods Live Updates, Telangana CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వానలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు (జూలై 11, సోమవారం) ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడి, తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. అన్ని జిల్లాల అధికారులతో మాట్లాడుతూ సీఎం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తక్షణ చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గోదావరి, గోదావరి ఉప నదుల్లో వరద పరిస్థితిని, ప్రవాహాన్ని గురించి సీఎం ఆరా తీస్తున్నారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ మరోమారు స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పైళ్ల శేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.నర్సింగ రావు, సీఎంఓ కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డి ప్రియాంక వర్ఘీస్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ఇఎన్సీ మురళీధర్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 10 =