ప‌ద్మ‌నాభ‌స్వామి ఆల‌య నిర్వ‌హ‌ణ‌పై ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికి హక్కు, సుప్రీం కోర్టు కీలక తీర్పు

Anantha Padmanabha Swamy, Anantha Padmanabha Swamy Temple, Anantha Padmanabha Swamy Temple Issue, Anantha Padmanabha Swamy Temple Management Issue, Padamanabha Swamy Temple Verdict, Padmanabha Swamy Temple, Supreme Court, Supreme Court Verdict on Anantha Padmanabha Swamy Temple

కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయం నిర్వహణకు సంబంధించి సుప్రీం కోర్టు జూలై 13, సోమవారం నాడు కీలక తీర్పు వెల్లడించింది. ఆలయ నిర్వహణ, ఆల‌యం ఆస్తుల్లో హిందూధ‌ర్మ చ‌ట్టం ప్ర‌కారం ట్రావెన్‌కోర్‌ రాజకుటుంబానికి హ‌క్కు ఉన్న‌ట్లు సుప్రీంకోర్టు వెల్ల‌డించింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆలయ ఆస్తులు, నిర్వహణ విషయంలో హక్కుల కోసం ట్రావెన్‌కోర్‌ రాజ కుటుంబం, కేరళ ప్రభుత్వానికి సంబంధించిన వివాదంపై విచారణ జరుగుతుంది.‌ ఈ నేపథ్యంలో రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. అలాగే ఆలయ పాలనా వ్యవహారాలను చూసేందుకు త్రివేండం జిల్లా జడ్జి ఆధ్వర్యంలో ఒక కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది. కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు ఆలయ వ్యవహారాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 9 =