టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Minister Peddireddy Ramachandra Reddy Interesting Comments on TDP Chief Chandrababu Tour of Kuppam, Minister Peddireddy Rama Reddy Comments on Chandrababu Naidu Kuppam Tour, Mango News, Mango News Telugu, Minister Peddireddy Rama Reddy Speech on Chandrababu Kuppam Tour, Minister Peddireddy Rama Reddy Latest News And Updates, TDP Chief Chandrababu Naidu, Minister Peddireddy Ramachandra Reddy, Chandrababu Naidu Kuppam Tour, TDP Chief Kuppam Tour, TDP, YSR Congress Party, AP CM Jagan Mohan Reddy,Nara Chandrababu Naidu,

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కుప్పంలో మూడు రోజులు పాటు పర్యటించిన విషయం తెలిసిందే. దీనిపై ఏపీ విద్యుత్, గనులు మరియు అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలలో కుప్పంలో వైసీపీ గెలవడం తథ్యమని, చంద్రబాబు పర్యటనే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. కుప్పం ప్రజలు చంద్రబాబును ఎప్పుడో మరిచి పోయారని, మూడు దశాబ్దాలకు పైగా కుప్పంలో గెలిపిస్తున్న ప్రజలకు ఆయన ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టేలా మీటింగ్స్ పెట్టి టీడీపీ శ్రేణులను వైసీపీ కార్యకర్తలపై దాడులకు ప్రేరేపించేలా చేశారని పెద్దిరెడ్డి మండిపడ్డారు.

చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇక్కడ హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్ కూడా పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వచ్చే ఎలక్షన్స్ లోపు హంద్రీనీవాను పూర్తి చేసి ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు. కుప్పాన్ని ఎంతో అభివృద్ధి చేశానని అంటున్నారని, మరి అలాంటప్పుడు మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు టీడీపీ ఘోర పరాజయం చెందిందని అన్నారు. కుప్పంలో ఈసారి తప్పకుండా వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా భరత్ గెలిస్తే మంత్రి చేస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =