అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడుగా మరోసారి అగ్రస్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ

PM Narendra Modi Tops Global Approval Rating List with Highest Rating of 75 Percent, PM Modi Tops Most Popular World Leaders List, PM Narendra Modi Lists Most Popular Worlds Leader List, Mango News, Mango News Telugu, PM Modi Top Global Leader With 75% Rating, PM Narendra Modi Latest News And Updates, PM Narendra Modi, Worlds Most Popular Leader 2022, PM Modi Tops Most Popular World Leaders, PM Narendra Modi Twitter Live Updates, Indian Prime Minister, Narendra Modi, PM Modi, 2022 Worlds Most Popular Leader,

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. 22 దేశాలకు సంబంధించి అత్యంత ఆమోదయోగ్యమైన నేతలపై “మార్నింగ్ కన్సల్ట్” అనే సంస్థ విడుదల చేసిన గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ జాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచి తన ఛరిష్మాను మరోసారి చాటారు. మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోదీ నాయకత్వాన్ని 75 శాతం మంది భారతీయ ప్రజలు ఆమోదించారు. ఈ సర్వే ఆగస్టు 17, 2022 నుంచి ఆగస్టు 23, 2022 మధ్య జరిగింది. ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 9వ స్థానంలో నిలిచారు.

మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ భారత్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, కెనడా, చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, జపాన్, మెక్సికో, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్ ఇలా మొత్తం 22 దేశాలకు సంబంధించిన అధినేతలు. నాయకుల ఆమోద రేటింగ్‌లను ట్రాక్ చేస్తోంది. ఈ క్రమంలో భాగంగానే గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ జాబితాను ప్రకటిస్తుంది. మరోవైపు మార్నింగ్ కన్సల్ట్ సర్వేలో గతంలో కూడా ప్రధాని మోదీనే అగ్రస్థానంలో నిలిచారు.

మార్నింగ్ కన్సల్ట్ సర్వే : టాప్ 10 లీడర్స్ అప్రూవల్ రేటింగ్స్:

  1. నరేంద్ర మోదీ – భారత్ – 75%
  2. ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ – మెక్సికో – 63%
  3. ఆంథోనీ అల్బనీస్ – ఆస్ట్రేలియా – 58%
  4. మారియో డ్రాగి – ఇటలీ – 54%
  5. ఇగ్నాజియో కాసిస్ – స్విట్జర్లాండ్ – 52%
  6. మాగ్డలీనా ఆండర్సన్ – స్వీడన్ – 50%
  7. అలెగ్జాండర్ డి క్రూ – బెల్జియం – 43%
  8. జెయిర్ బోల్సోనారో – బ్రెజిల్ – 42%
  9. జో బైడెన్ – యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా – 41%
  10. మైఖేల్ మార్టిన్ – ఐర్లాండ్ – 39%
  11. జస్టిన్ ట్రూడో – కెనడా – 39%

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =