అమెరికా: టెక్సాస్‌లోని స్కూల్‌లో కాల్పులు.. 19 మంది పిల్లలు సహా 21 మంది దుర్మరణం, అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి

Texas School Shooting Incident 21 Lost Lives Including 19 Children President Joe Biden Extends Condolences, President Joe Biden Extends Condolences For Texas School Shooting Incident, Texas School Shooting Incident 21 Lost Lives Including 19 Children, Texas school shooting, 21 Lost Lives Including 19 Children, Texas elementary school, President Joe Biden, Texas School Shooting Incident News, Texas School Shooting Incident Latest News, Texas School Shooting Incident Latest Updates, Texas School Shooting Incident Live Updates, mass shooting incident at a school in Texas, Mango News, Mango News Telugu,

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఈ దాడిలో ముక్కుపచ్చారని చిన్నారులు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం (అక్కడి స్థానిక కాలమానం ప్రకారం) ఈ ఘటన జరిగింది. టెక్సాస్ ప్రాథమిక పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు తుపాకీతో ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అతను అన్ని తరగతి గదులను కలియ తిరుగుతూ కాల్పులు జరిపడంతో 19 మంది పసి పిల్లలు మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులంతా 11 యేళ్ళలోపు వారేనని అధికారులు చెప్పారు. మొత్తం 21 మంది మరణించగా.. మృతుల్లో ఇద్దరు పెద్దలు కూడా ఉన్నారని, వారిలో ఒకరు ఉపాధ్యాయుడని అధికారులు తెలిపారు. దీనిని ఈ దశాబ్దంలోనే అత్యంత పాశవిక దాడిగా అభివర్ణించారు. అయితే దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు.

కాగా ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఈ బాధ తల్లిదండ్రులకే కాదు, ఈ దేశంలోని ప్రతి పౌరుని హృదయానికి తాకుతోంది. కామన్సెన్స్ తుపాకీ చట్టాలను అడ్డుకునే లేదా ఆలస్యం చేసే లేదా నిరోధించే వారికి ఇది సరైన సమయం. మేము మిమ్మల్ని అనుమతించాల్సిన అవసరం ఉంది” అని ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు టెక్సాస్‌ గవర్నర్ గ్రెగ్ అబాట్ కూడా తన సంతాపం తెలియజేశారు. దుండగుడిని 18 ఏళ్ల స్థానిక నివాసి ‘సాల్వడార్ రామోస్’ గా గుర్తించినట్లు ప్రకటించారు. అతను పోలీసుల ఎదురు కాల్పుల్లో కాల్చి చంపాడు, అని అబాట్ చెప్పాడు. అయితే, అతను రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌కు వెళ్లే ముందు తన అమ్మమ్మను కాల్చిచంపాడని భావిస్తున్నట్లు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − six =