వైభవంగా 93వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం, విజేతల జాబితా ఇదే…

2021 Oscar Awards Winners, 2021 Oscars complete winners list, 2021 Oscars Winners, Full list of 2021 Academy Awards, Full List of 2021 Oscar Awards Winners, Mango News, Oscar, Oscar Awards Winners, Oscar Winners, Oscar Winners 2021, Oscar Winners List, Oscars 2021 Full list of winners and nominees, Oscars Winners, The Full List of 2021 Oscar Awards Winners, The Full List of Oscar Awards Winners

ప్రపంచ సినీ అభిమానులు ఏంతో ఆసక్తిగా ఎదురుచూసిన 93వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్ 25, ఆదివారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ వేడుకలను తొలిసారిగా రెండు వేదికలలో నిర్వహించారు. సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ప్రముఖ హాలీవుడ్‌ సెలెబ్రిటీలు హాజరయ్యారు. ఈసారి ‘నో మ్యాడ్‌ లాండ్‌’ చిత్రం మూడు ఆస్కార్‌ అవార్డులు దక్కించుకుని సత్తాచాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి విభాగాల్లో నో మ్యాడ్‌లాండ్‌ అవార్డులు దక్కుంచుకుంది. ది ఫాదర్‌ సినిమాలో నటించిన ఆంథోని హాప్కిన్స్‌ ఉత్తమ నటుడు అవార్డు అందుకోగా, జుడాస్ అండ్ ది బ్లాక్ మెసయ్య చిత్రంలో నటనకు డానియెల్‌ కలువోయా ఉత్తమ సహాయ నటుడు అవార్డు అందుకున్నాడు. నో మ్యాడ్‌ లాండ్‌ చిత్రంలో నటనకు గానూ ఫ్రాన్సెస్‌ మెక్‌డోర్మెండ్‌ ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకుంది.

ఆస్కార్‌ 2021 విజేతలు వీరే:

  • ఉత్తమ చిత్రం: నో మ్యాడ్‌ లాండ్‌
  • ఉత్తమ నటుడు: ఆంథోని హాప్కిన్స్‌ – ది ఫాదర్‌
  • ఉత్తమ నటి: ఫ్రాన్సెస్‌ మెక్‌డోర్మెండ్‌ – నో మ్యాడ్‌ లాండ్‌
  • ఉత్తమ సహాయ నటుడు: డానియెల్‌ కలువోయా – జుడాస్ అండ్ ది బ్లాక్ మెసయ్య
  • ఉత్తమ సహాయక నటి: యుహ్ జంగ్ యూన్ – మినారి
  • ఉత్తమ దర్శకురాలు: క్లోవీ చావ్‌ – నో మ్యాడ్‌ లాండ్‌
  • ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్ ప్లే: ఎమరాల్డ్‌ ఫెన్నెల్
  • ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: అనదర్‌ రౌండ్‌ (డెన్మార్క్‌)
  • ఉత్తమ యానిమేటేడ్‌ ఫీచర్‌: సోల్‌
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌: టెనెట్‌
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: మై ఆక్టోపస్‌ టీచర్‌
  • ఉత్తమ లైవ్‌ యాక్షన్ షార్ట్‌: టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్
  • ఉత్తమ సౌండ్ : సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌
  • ఉత్తమ మ్యూజిక్ ఒరిజనల్ సాంగ్: ఫైట్ ఫర్ యూ – జుడాస్ అండ్ ది బ్లాక్ మెసయ్య
  • ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ : మై ఆక్టోపస్‌ టీచర్‌
  • ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: క్రిస్టోఫర్‌ హామ్టన్‌, ఫ్లొరియన్‌ జెల్లర్‌ (ది ఫాదర్‌)
  • ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్టు : కోలేట్టే
  • ఉత్తమ​ ప్రొడక్షన్ డిజైన్‌: మంక్
  • ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్ : ఇఫ్‌ ఎనిథింగ్‌ హ్యాపెన్స్‌ ఐ లవ్‌ యూ
  • ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: మంక్
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =