మేడారం మహా జాతర: ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నాలుగు రోజులు నిర్వహణ

Mango News, Medaram Jatara, Medaram Jatara 2022, Medaram Jathara in Feb next year, Medaram Maha Jathara, Medaram Maha Jathara to be Conducted, Medaram Maha Jathara to be Conducted from February 16 to 19, medaram sammakka sarakka jatara, Medaram Sammakka Sarakka Jatara 2022 D, Medaram Sammakka Sarakka Jatara 2022 Dates, Medaram Sammakka Sarakka Jatara 2022 Dates Announced, Sammakka Sarakka Jatara 2022 Dates, Tribal priests announced the dates of Medaram Jatara, Tribal priests announced the dates of Medaram Jatara 2022

తెలంగాణలో శ్రీ సమ్మక్క–సారలమ్మల మహా జాతర తేదీలు ఖరారయ్యాయి. 2022లో జరగనున్న మేడారం మహా జాతరను ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహించనున్నట్టు మేడారం పూజారులు ఆదివారం నాడు ప్రకటించారు. మాఘమాసంలో నాలుగు రోజులపాటుగా సమ్మక్క-సారలమ్మ మహా జాతరను వైభవంగా జరపనున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 16వ తేదీన సారలమ్మ దేవత, పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెల వద్దకు తీసుకురావడం, ఫిబ్రవరి 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెల వద్దకు చేరుట, ఫిబ్రవరి 18న సమ్మక్క-సారలమ్మలకు ప్రజలు మొక్కులు సమర్పించుట, ఫిబ్రవరి 19 న వన ప్రవేశం, మహా జాతర ముగింపు కార్యక్రమాలు ఉంటాయని పూజారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మే 1, 2021 నుంచి మే 15, 2021 వరకు మేడారం అమ్మవార్ల దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =