330 కి.మీ బైకుపై ప్రయాణించి అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యే.. ఎక్కడంటే?

The MLA Who Traveled 330 km on a Bike and Went to the Assembly Where,The MLA Who Traveled 330 km on a Bike,MLA Who Traveled and Went to the Assembly,MLA Who Traveled,MLA, Madhyapradesh, MP MLA, Bike, MP Assembly,Mango News,Mango News Telugu,Newly elected MLA travels 330 km,Mla Kamleshwar Dodiyar,Madhya pradesh Latest News,Madhya Pradesh Latest Updates,Madhya Pradesh Live News
MLA, Madhyapradesh, MP MLA, Bike, MP Assembly

గ్రామ సర్పంచులు కూడా ఈరోజుల్లో కార్లను మెయింటేన్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా రెండు, మూడు కార్లు.. చుట్టూ పది మంది జనాలను వేసుకొని వెళ్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు, మంత్రుల గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఎటువెళ్లినా పెద్ద కాన్వాయ్, పోలిస్ బందోబస్తుతో వెళ్తుంటారు. హడావుడి చేస్తుంటారు. అయితే ఒక ఎమ్మెల్యే మాత్రం ఎటువంటి హడావుడి లేకుండా బైకుపై అసెంబ్లీకి హాజరయ్యారు. అది కూడా సొంత బైకు కాదు. తన స్నేహితుడి బైక్ తీసుకొని దాదాపు 330 కి.మీ ప్రయాణించి అసెంబ్లీకి వెళ్లారు. మధ్యప్రదేశ్‌లో జరిగింది ఈ ఘటన.

ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ ఆదివాసీ పార్టీ తరుపున పోటీచేసి కమలేశ్వర్ డొడియార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నేత హర్ష్ విజయ్ గహ్లోత్‌పై 4.618 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భారతీయ ఆదివాసీ పార్టీ తరుపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే కమలేశ్వర్ డొడియార్. ఇటీవల ఆయన అసెంబ్లీకి హాజరయ్యేందుకు తన స్నేహితుడి బైక్‌ను తీసుకొని వెళ్లారు. తన సొంత గ్రామమైన సైలానా నుంచి 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని భోపాల్‌కు బైక్‌పై వెళ్లారు.

ముందు అసెంబ్లీ ఎదుట కమలేశ్వర్ డొడియార్‌ను చూసి సిబ్బంది లోపలికి అనుమతించలేదు. చివరికి ఎమ్మెల్యేగా గెలిచిన ధ్రవపత్రాన్ని చూపించడంతో కమలేశ్వర్‌ను లోపలికి అనుమతించారు. ఆ తర్వాత అసెంబ్లీ అధికారులకు ఎమ్మెల్యేగా గెలిచిన ధ్రవపత్రాన్ని కమలేశ్వర్ డొడియార్ అందజేశారు.

అయితే ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి కారు లేకపోవటం ఏమిటని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పేరు ప్రఖ్యాతాల కోసం ఇలా చేసుంటారని అంటున్నారు. కానీ కమలేశ్వర్ ఆ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. తాను నిరుపేద కుటుంబం నుంచి వచ్చానని.. కారు కొనే స్థోమత లేదని స్పష్టం చేశారు. బైకు కూడా తనది కాదని.. తన స్నేహితుడిది తీసుకొని అసెంబ్లీకి హాజరయ్యానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కమలేశ్వర్‌కు బైకుపై అసెంబ్లీకి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + three =