డిసెంబర్ 9 నుంచీ కాంగ్రెస్ 2 గ్యారంటీలు అమలు

From December 9 Congress 2 guarantees Implementation,From December 9 Congress 2 guarantees,Congress 2 guarantees Implementation,Minister D Sridhar Babu,Women in TSRTC buses,Rajiv Aarogyasri health insurance,Free Bus Service For Women,Mango News,Mango News Telugu,CM Revanth Reddy, Minister Sridhar Babu,Sonia Gandhi Birthday Gift, Sonia Gandhi, Birthday, December 9, Congress 2 guarantees implementation,CM Revanth Reddy Latest News,CM Revanth Reddy Latest Updates,Congress 2 guarantees Latest News
CM Revanth Reddy, Minister Sridhar Babu,Sonia Gandhi Birthday Gift, Sonia Gandhi, Birthday, December 9, Congress 2 guarantees implementation

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం  చేపట్టాక.. తమ ఫోకస్ అంతా ఆరు హామీల మీదే పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే కర్ణాటక , తమిళనాడులో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని.. తెలంగాణలో  కూడా వీలయినంత త్వరగా అమలు చేయడానికి రెడీ అవుతున్నారు.

దీనిలో భాగంగానే  తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మొదటి కేబినెట్ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడారు. తామంతా  ఆరు గ్యారెంటీలపై సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.  సోనియా పుట్టిన రోజు అయిన డిసెంబర్ 9వ తారీకున  రెండు గ్యారెంటీలను తెలంగాణలో అమల్లోకి తీసుకు వస్తున్నట్లు ఆయన చెప్పారు.

మిగిలిన నాలుగు గ్యారెంటీలపైన కూడా చర్చించి అతి త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. వీటిలో మొదటి గ్యారెంటీగా  మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని, రెండవ గ్యారెంటీగా ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలకు పెంపును అమలులో పరుస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. ఆరు హామీలు అమలు అసలు అసాధ్యం అన్న వాళ్లకు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు హామీలపై దృష్టి పెట్టడమే కాకుండా..డిసెంబర్ 9 నుంచే అమలు చేయడంపై రాజకీయ సర్కిల్‌లో  హర్షం వ్యక్తం అవుతోంది.

మరోవైపు ఇప్పటికే ఏయే కేటగిరీ బస్సుల్లో ఈ ఫ్రీ స్కీమును అమలు చేస్తే.. ప్రభుత్వానికి ఎంత భారం పడనుందనే విషయంలో టీఎస్ఆర్టీసీ అధికారులు లెక్కలు వేసినట్లు తెలుస్తోంది.  కర్ణాటకలో అమలవుతోన్న ఈ మహిళల ఉచిత ప్రయాణం గురించి  పూర్తి వివరాలను పరిశీలించడానికి నలుగురు ఆర్టీసీ అధికారుల బృందం వెళ్లి వివరాలు కూడా సేకరించినట్లు సమాచారం.అయితే టీఎస్ఆర్టీసీ అధికారులు అంచనా వేసినట్లే రేవంత్ సర్కార్ మహిళల ఉచిత ప్రయాణం పథకాన్నే మొదట అమలు పరుస్తోంది.

ఇక డిసెంబర్ 9న  తెలంగాణ అసెంబ్లీ సమావేశాన్ని  నిర్వహించబోతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆ సమయంలో ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా2014 నుంచి 2023 వరకు ప్రభుత్వ శాఖల ఖర్చులపై కూడా తాము చర్చించినట్లు చెప్పారు.తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఖజానా పరిస్థితి  ప్రజలకు తెలియాలని ఆదాయ, వ్యయాలపై.. శ్వేత పత్రం రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు  తెలియజేశారు.ఏది ఏమయినా హామీ ఇచ్చినట్లుగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా..ఇంత త్వరగా  అమలు చేయడంపై తెలంగాణ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + seven =