తొలి రోజు ప్రజాదర్భార్‌కు భారీ స్పందన

Huge response to Prajadarbhar on the first day,Huge response to Prajadarbhar,Prajadarbhar on the first day,Prajadarbhar,CM Revanth reddy, Prajadharbar, Telangana CM, CMO , Congress,CM Revanth reddy Latest News,Mango News,Mango News Telugu,CM Revanth reddy Latest Updates,Huge Response From Public,Revanth Praja Darbar,From Pragathi Bhavan to Praja Bhavan,Prajadarbhar Latest News,Prajadarbhar Latest Updates
CM Revanth reddy, Prajadharbar, Telangana CM, CMO , Congress

తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ దూకుడుగా ముందుకెళ్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలు, మాటను నిలబెట్టుకునే దిశగా అడుగులేస్తోంది. ప్రమాణస్వీకారం తర్వాత రేవంత్ రెడ్డి ప్రజదర్భార్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం జ్యోతిభాపూలే ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వయంగా రేవంత్ రెడ్డి క్యూ లైన్లలో ఉన్న ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చి ప్రజాదర్భార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం నుంచే ప్రజాభవన్ ఎదుట బారులు తీరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ మేరకు అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి.. వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం సచివాలయానికి వెళ్లాక మంత్రి సీతక్క అర్జీలను స్వీకరించారు.

ఇకపోతే ప్రజాదర్భార్ కార్యక్రమం కోసం రేవంత్ రెడ్డి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా 20 మంది సిబ్బందిని నియమించారు. ముందుగా  ప్రజల అర్జీల వివరాలను హెల్ప్ డెస్క్‌లో సిబ్బంది నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత వారిని క్యూ లైన్లలో ప్రజా భవన్‌లోకి పంపించారు. అలాగే ప్రజాదర్భార్‌ను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాకు ఓ టీమ్‌ను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

ఇకపోతే మొదటి రోజు ప్రజా దర్భార్ తీరును తెలియజేస్తూ రేవంత్ రెడ్డి ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. జనం కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజా దర్భార్ సాగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జనం నుంచి ఎదిగి.. ఆ జనం గుండె చప్పుడు విని.. వాళ్ల సేవకుడిగా సాయం చేసే అవకాశం రావడానికి మించిన తృప్తి ఏంముంటుందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 5 =