టిక్‌టాక్‌ సీఈవో కెవిన్‌ రాజీనామా

Kevin Mayer Resigns, Kevin Mayer steps down as TikTok CEO, TikTok CEO Kevin Mayer, TikTok CEO Kevin Mayer Quits, TikTok CEO Kevin Mayer resigns, TikTok Chief Executive Officer, TikTok Chief Executive Officer Kevin Mayer Resigns, TikTok Chief Executive Officer Resigns

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) కెవిన్ మేయర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి రాసిన లేఖలో “నేను సంస్థను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నానని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను” అని పేర్కొన్నారు. టిక్‌టాక్‌ ప్రస్తుత జనరల్ మేనేజర్ వెనెస్సా పప్పాస్ తాత్కాలిక సీఈవోగా కొన‌సాగ‌నున్నారు. గత కొన్ని నెలలుగా రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. కెవిన్ నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తాము. కంపెనీలో సేవలకు కెవిన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని టిక్‌టాక్ ప్రతినిధి వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కోట్లాది మంది వినియోగదారుల ఆదరణను పొందిన చైనా ఆధారిత టిక్‌టాక్‌ సంస్థకు ఇటీవల కాలంలో వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. భారత్‌-చైనా వివాదం నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా టిక్‌టాక్‌ సహా మొత్తం 59 చైనా ఆధారిత యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే దేశ భద్రత, రక్షణ కోసం టిక్‌టాక్ నిషేధంవైపు అమెరికా కూడా అడుగులు వేసింది. టిక్‌టాక్‌ కొనుగోలుపై అమెరికన్‌ కంపెనీలు చట్ట పరిధిలో 45 రోజుల లోపలే చర్చలు జరపాలని, ఆ తర్వాత ఎలాంటి లావాదేవీలు జరపడమైనా నిషిద్ధమని పేర్కొంటూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ క్రమంలో అమెరికాలో నిషేధం తప్పించుకుని టిక్‌టాక్ కార్యకలాపాలు కొనసాగించాలంటే వేరే సంస్థకు విక్రయించాల్సిన పరిస్థితిలు ఏర్పడ్డాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో సీఈవో ప‌దవికి కెవిన్ రాజీనామా చేయ‌డం చర్చకు దారితీసింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =