రాష్ట్రపతి పదవికి విపక్షాల అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఖరారు

Former Union Minister Yashwant Sinha Named Opposition Candidate For Presidential Elections, Opposition Candidate For Presidential Elections, Presidential Elections, Former Union Minister Yashwant Sinha is The Opposition's Presidential Candidate, EX-Union Minister Yashwant Sinha is The Opposition's Presidential Candidate, Yashwant Sinha is The Opposition's Presidential Candidate, Opposition's Presidential Candidate, EX-Union Minister Yashwant Sinha, Former Union Minister Yashwant Sinha, Union Minister Yashwant Sinha, Minister Yashwant Sinha, Yashwant Sinha, Presidential Candidate, Opposition's Presidential Candidate News, Opposition's Presidential Candidate Latest News, Opposition's Presidential Candidate Latest Updates, Opposition's Presidential Candidate Live Updates, Mango News, Mango News Telugu,

అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో పని చేసిన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ఈరోజు రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ ఏర్పాటు చేసిన సమావేశానికి పార్లమెంట్ అనెక్స్‌లో సమావేశమైన ప్రతిపక్ష నేతలు సిన్హా పేరును ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ మేరకు ప్రతిపక్షాల తరపున సంయుక్త ప్రకటనను కాంగ్రెస్ కమ్యూనికేషన్ చీఫ్ జైరాం రమేష్ మీడియాకు తెలిపారు. ‘‘రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను ఈరోజు జరిగిన సమావేశంలో ఎంపిక చేశాం. అలాగే యశ్వంత్ సిన్హా ప్రచారానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు సిన్హాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం సాధించేందుకు మోదీ ప్రభుత్వం ఎలాంటి తీవ్రమైన ప్రయత్నం చేయనందుకు చింతిస్తున్నామని రమేష్ అన్నారు.

ఈ నేపథ్యంలో యశ్వంత్ సిన్హా.. “టిఎంసిలో మమతాజీ నాకు అందించిన గౌరవం మరియు ప్రతిష్టకు నేను ఆమెకు కృతజ్ఞతలు. ఇప్పుడు ఒక పెద్ద జాతీయ ప్రయోజనం కోసం నేను విపక్షాల ఐక్యత కోసం పని చేయడానికి పార్టీ నుండి తప్పుకోవాల్సిన సమయం వచ్చింది. ఆమె ఈ చర్యను ఆమోదిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు. కాగా జులైలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇంకా తన ఎంపికను ప్రకటించలేదు. ఆ పార్టీ తరపున ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడును ప్రకటించే అవకాశాలున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల కోసం తన ఎంపికను ఖరారు చేసే అవకాశం ఉన్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని కూడా ఈరోజు నిర్వహించనుంది. రేపటికల్లా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =