కేంద్ర కేబినెట్ నిర్ణయాలు: స్పెక్ట్ర‌మ్ వేలానికి ఆమోదం, చెరకు రైతులకు రూ.3500 కోట్లు రాయితీ

Union Cabinet Approves Auction of Spectrum,Telecom Stocks In Focus After Cabinet Approves Spectrum Auction,Cabinet Approves Next Round Of Spectrum Auction,Cabinet Approves Next Round Of Spectrum Auction Says RS Prasad,Cabinet Briefing,Union Cabinet,Centre,Boost For Sugarcane Farmers,Subsidiaries For Farmer,Revised Cost Estimate,North Eastern Region Power System Improvement Project,Powergrid,Public Sector Undertaking,Ministry Of Power,Current Affairs,Centre On Spectrum Auctions,Govt On Key Decisions,Govt Announces Key Decision,Centre Announces Key Decision,Cabinet Approves Next Round Of Spectrum Auction,Union Cabinet Approves Auction Of Spectrum,Mango News,Mango News Telugu

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్‌, రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు:

  • స్పెక్ట్ర‌మ్ వేలానికి కేబినెట్ ఆమోదం. వివిధ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల‌కు సంబంధించి 20 ఏళ్ల కాల‌ప‌రిమితితో వేలం నిర్వహించనున్నారు. సుమారు రూ.3,92,332.70 కోట్ల‌ విలువగల స్పెక్ట్రమ్ వేలం వచ్చే జనవరి నెల చివరిలో జరగనుంది. వేలం విజేతలు ఒకేసారి లేదా విడతల వారీగా చెల్లింపులు జరిపేందుకు అవకాశం.
  • 60 లక్షల పంచదార ఎగుమతులపై రూ.3500 కోట్ల రాయితీ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం. రాయితీ సొమ్మును రైతుల ఖాతాలో నేరుగా జమ చేయనున్నారు. ఈ నిర్ణయం ఐదు కోట్ల చెరకు రైతులు మరియు వారిపై ఆధారపడిన వారితో పాటు చక్కెర మిల్లుల్లో పనిచేస్తున్న ఐదు లక్షల మంది కార్మికులకు ప్రయోజనం చేకూర్చనుంది.
  • విద్యుత్ రంగంలో పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో కలిసి పనిచేయడం కోసం భారత్ మరియు యుఎస్ఎ మధ్య అవగాహన ఒప్పందంకు ఆమోదం. 
  • నార్త్ ఈస్టర్న్ రీజియన్ పవర్ సిస్టమ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్ వ్యయ అంచనాను రూ. 6,700 కోట్లకు సవరిస్తూ ఆమోదం. ఈశాన్య రాష్ట్రాలలో ఇంట్రా-స్టేట్ ట్రాన్స్మిషన్ మరియు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహద పడనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 7 =