తెలంగాణలో 2021 లో సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవుల జాబితా ఇదే…

Telangana Government Holidays List

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి సంబంధించిన సెలవులను నవంబర్ 10, మంగళవారం నాడు ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2021 లో 28 రోజుల సాధారణ సెలవులు, మరో 25 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించారు. 2021 నూతన సంవత్సరం ప్రారంభ రోజైన జనవరి 1 వ తేదీని ప్రభుత్వం సాధారణ సెలవుగా ప్రకటించింది. దీంతో ఫిబ్రవరి 13, 2021 రెండో శనివారాన్ని పనిదినంగా నిర్ణయించినట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులతో పాటుగా 5 ఐచ్ఛిక సెలవులను వినియోగించుకోవచ్చని తెలిపారు. అలాగే సాధారణ సెలవులు పరిశ్రమలకు వర్తించవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక విద్యాసంస్థలు, పబ్లిక్‌ వర్క్స్‌ విభాగాల సెలవులపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు రంజాన్‌, బక్రీద్‌, మొహర్రం, మిలాద్‌ ఉన్‌ నబి వంటి పండుగల సెలవులపై మార్పులేమైనా ఉంటే అప్పుడు ప్రత్యేకంగా ప్రకటిస్తామని వెల్లడించారు.

సాధారణ సెలవులు:

  1. కొత్త సంవత్సరం – జనవరి 1 – శుక్రవారం
  2. భోగి – జనవరి 13 – బుధవారం
  3. సంక్రాంతి – జనవరి 14 – గురువారం
  4. రిపబ్లిక్ డే – జనవరి 26 – మంగళవారం
  5. మహా శివరాత్రి – మార్చి 11 – గురువారం
  6. హోలీ – మార్చి 29 – సోమవారం
  7. గుడ్‌ ఫ్రైడే – ఏప్రిల్‌ 2 – శుక్రవారం
  8. బాబు జగ్జీవన్ రామ్ జయంతి – ఏప్రిల్ 5 – సోమవారం
  9. ఉగాది – ఏప్రిల్ 13 – మంగళవారం
  10. అంబేడ్కర్‌ జయంతి – ఏప్రిల్‌ 14 – బుధవారం
  11. శ్రీరామ నవమి – ఏప్రిల్‌ 21 – బుధవారం
  12. రంజాన్‌ – మే 14 – శుక్రవారం
  13. రంజాన్‌ మరుసటి రోజు – మే 15 – శనివారం
  14. బక్రీద్‌ – జులై 21 – బుధవారం
  15. బోనాలు – ఆగస్టు 2 – సోమవారం
  16. స్వాతంత్య్ర దినోత్సవం – ఆగస్టు 15 – ఆదివారం
  17. మొహర్రం – ఆగస్టు 19 – గురువారం
  18. శ్రీకృష్ణాష్టమి – ఆగస్టు 31 – మంగళవారం
  19. వినాయక చవితి – సెప్టెంబర్ 10 – శుక్రవారం
  20. గాంధీ జయంతి – అక్టోబరు 2 – శనివారం
  21. బతుకమ్మ ప్రారంభం – అక్టోబరు 06 – బుధవారం
  22. దసరా – అక్టోబరు15 – శుక్రవారం
  23. దసరా మరుసటి రోజు – అక్టోబర్ 16 – శనివారం
  24. మిలాద్‌-ఉన్‌-నబి – అక్టోబరు 19 – మంగళవారం
  25. దీపావళి – నవంబరు 4 – గురువారం
  26. కార్తిక పౌర్ణమి/ గురునానక్‌ జయంతి – నవంబరు 19 – శుక్రవారం
  27. క్రిస్మస్ -‌ డిసెంబరు 25 – శనివారం
  28. బాక్సింగ్‌ డే – డిసెంబరు 26 – ఆదివారం

ఐచ్ఛిక సెలవులు:

  1. కనుమ – జనవరి 15 – శుక్రవారం
  2. శ్రీపంచమి – ఫిబ్రవరి 16 – మంగళవారం
  3. హజరత్ అలీ జయంతి – ఫిబ్రవరి 26 – శుక్రవారం
  4. షబ్-ఇ-మిరాజ్ -‌ మార్చి 12 – శుక్రవారం
  5. షబ్-ఇ-బారాత్‌ – మార్చి 29 – సోమవారం
  6. తమిళ నూతన సంవత్సరం – ఏప్రిల్ 14 – బుధవారం
  7. మహవీర్‌ జయంతి – ఏప్రిల్‌ 25 – ఆదివారం
  8. షాదత్‌ హజ్రత్‌ అలీ – మే 3 – సోమవారం
  9. జుమాతుల్‌ వాదా – మే 7 – శుక్రవారం
  10. సాహిబ్-ఇ-ఖదీర్‌ – మే 10 – సోమవారం
  11. బసవ జయంతి – మే 14 – శుక్రవారం
  12. బుద్ధ పూర్ణిమ – మే 26 – బుధవారం
  13. రథయాత్ర – జులై ‌ 12 – సోమవారం
  14. ఈద్ -ఏ-ఘాదిర్ – జులై 27 – మంగళవారం
  15. పార్శి నూతన సంవత్సరం – ఆగస్టు 16 – సోమవారం
  16. 9 వ మొహర్రం – ఆగస్టు 18 – బుధవారం
  17. వరలక్ష్మీ వ్రతం – ఆగస్టు 20 – శుక్రవారం
  18. రాఖీ పౌర్ణమి – ఆగస్టు 22 – ఆదివారం
  19. ఆర్బయీన్‌ – సెప్టెంబర్ 29 – బుధవారం
  20. దుర్గాష్టమి – అక్టోబర్ 13 – బుధవారం
  21. మహర్నవమి – అక్టోబర్ 14 – గురువారం
  22. నరక చతుర్దశి – నవంబర్ 3 – బుధవారం
  23. యజ్‌ దాహుమ్‌ షరీఫ్‌ – నవంబరు 16 – మంగళవారం
  24. సయ్యద్ మహమ్మద్ జువాన్ పురి మహాది జయంతి – డిసెంబర్ 19 – ఆదివారం
  25. క్రిస్మస్‌ ఈవ్ -‌ డిసెంబరు 24 – శుక్రవారం

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eighteen =