పార్లమెంట్ సెంట్రల్ హల్ లో 72వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, హాజరైన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

72nd Constitution Day Celebrations, 72nd Constitution Day Celebrations Conducted at the Central Hall of the Parliament, 72nd Constitution Day of India celebrated, 72nd Constitution Day of India celebrated today, Constitution Day 2021 LIVE, Constitution Day 2021 Live Updates, Constitution Day Celebrations Conducted at the Central Hall of the Parliament, Constitution Day to be celebrated in Parliament, Mango News, PM Modi On Constitution Day, PM Modi to address Constitution Day event, PM to address Constitution Day event, President Ram Nath Kovind

రాజ్యాంగ దినోత్సవ వేడుకలను (నవంబర్ 26) పార్లమెంట్ సెంట్రల్ హల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోకసభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశానికి చెందిన అనేక మంది నాయకులు భారత రాజ్యాంగాన్ని మనకు అందించాలని మేధోమథనం చేశారన్నారు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్, డా.రాజేంద్ర ప్రసాద్, మహాత్మా గాంధీ వంటి దూరదృష్టి గల మహానుభావులు మరియు భారత స్వాతంత్య్ర పోరాటంలో పోరాడిన వారందరికీ నివాళులర్పించే రోజు. అలాగే ఈ సభకు సెల్యూట్ చేసే రోజు ఈరోజు. మన రాజ్యాంగం కేవలం అనేక వ్యాసాల సమాహారం కాదు, మన రాజ్యాంగం సహస్రాబ్దాల గొప్ప సంప్రదాయం అని చెప్పారు.

1950 తర్వాత ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఏమి జరిగిందో అందరికీ తెలియజేయాలని, కానీ కొంతమంది అలా చేయలేదన్నారు. మనం చేసేది సరైనదా కాదా అని విశ్లేషించుకోవడానికి కూడా ఈ రోజును జరుపుకోవాలన్నారు. దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సందర్భంగా, మన హక్కులు పరిరక్షించబడేలా విధిగా గొప్ప మార్గంలో ముందుకు సాగడం అవసరమన్నారు. అలాగే 13 సంవత్సరాల క్రితం ఇదే రోజున ముంబయిలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో చనిపోయిన వారికి ప్రధాని మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. మోదీ ప్రసంగం అనంతరం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలు, దేశప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా 72వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, శాసనమండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, సత్యవతి రాథోడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రశాంత్‌ రెడ్డి, పలువురు ఎమ్మెలేలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. మన రాజ్యాంగం ఆమోదం కోసం రాజ్యాంగ రచన కమిటీ ఎంతో కృషి జరిపిందని, దశాబ్దాలుగా ఎన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొని దృఢంగా నిలిచిందన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + two =