కరోనా వ్యాక్సినేషన్: రాష్ట్రాలకు ఇప్పటికే 20 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు ఉచితంగా అందజేత

Union Govt so far Provided More than 20 Crore Covid Vaccine Doses to States Free of Cost,Mango News,Mango News Telugu,Over 20 Cr Covid Vaccine Doses Given To States,Coronavirus,Over 20 Crore Covid Vaccines Provided To States,Over 20 Cr Covid-19 Vaccine Doses With States,Coronavirus Vaccine,Vaccine,Centre Provides More Than 20 Crore Vaccine Doses To States,Union Govt To Provided More Than 20 Crore Covid Vaccine Doses,20 Crore Covid Vaccine Doses,Over 2 Crore Covid-19 Vaccine Doses Available,Coronavirus Pandemic,Coronavirus India Update,Coronavirus India,Covid 19 Update,India Covid 19 News,Covid-19 Update,Covid-19 India Updates,India Covid Cases,20 Crore Covid Vaccine,Covid Vaccine,Union Govt

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులు, త్వరలో అందించబోయే డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 20 కోట్లకుపైగా (20,76,10,230) కరోనా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా అందించినట్టు తెలిపారు. ఇందులో వ్యాక్సిన్ వృధాతో కలిపి మే 17, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 18,71,13,705 డోసులను వినియోగించినట్టు ప్రకటించారు.

ఇక అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు ఈ రోజు ఉదయం 8 గంటల వరకు 2 కోట్లకుపైగా (2,04,96,525) కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. అలాగే రాబోయే 3 రోజుల్లో మరో దాదాపు 3 లక్షల (2,94,660) వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వద్ద 22,70,216, తమిళనాడు వద్ద 14,19,296, మధ్యప్రదేశ్ వద్ద 13,73,783, గుజరాత్ వద్ద 11,25,547, కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 15 =