కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గౌహతిలోని అమిన్‌గావ్ ప్రాంతంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ (అస్సాం) కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశం యొక్క తదుపరి జనాభా గణన/లెక్కింపు ఎలక్ట్రానిక్ సెన్సస్ లేదా ఇ-సెన్సస్ గా ఉంటుందని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆలస్యమైన తదుపరి జనాభా లెక్కింపు ప్రక్రియను డిజిటలైజేషన్ చేయడంతో (ఇ-సెన్సస్), ఇది వందశాతం ఖచ్చితంగా ఉంటుందని, దీని ఆధారంగా రాబోయే 25 సంవత్సరాలకు దేశ రోడ్‌మ్యాప్ నిర్మించబడుతుందని అమిత్ షా తెలిపారు.
అలాగే జనన, మరణ రిజిస్టర్ ను కూడా జనాభా లెక్కల రిజిస్టర్ తో అనుసంధానం చేస్తామని చెప్పారు. పుట్టిన వెంటనే జనాభా లెక్కల రిజిస్టర్ లో ఆ వివరాలు చేర్చబడతాయని, వారికీ 18 ఏళ్లు నిండిన తర్వాత ఓటర్ల జాబితాలో పేరు చేర్చబడుతుందన్నారు. ఇక మరణించిన తర్వాత వారి పేర్లు తొలగించబడతాయని, ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయన్నారు. 2024 నాటికి ప్రతి జననం మరియు మరణం నమోదు చేయబడుతుందని, దీంతో అప్పటినుంచి జనాభా లెక్కింపు దానంతట అదే ఆటోమాటిక్ గా అప్ డేట్ అవుతుందని చెప్పారు. జనాభా లెక్కింపు ప్రక్రియను మరింత శాస్త్రీయంగా నిర్వహించేందుకు ఆధునిక పద్ధతులను జోడించబోతున్నట్టు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ