రైతుల ఆందోళన, చర్చలకు ఆహ్వానించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Union Home Minister Amit Shah Called Farmers For Talks Today At 7 PM,Farmers Protests Continue,Farmer Leaders To Meet Amit Shah Today At 7 Pm,Farmers To Meet Home Minister Amit Shah At 7Pm,Amit Shah Steps In,Amit Shah Calls Farmers For Talks A Day Before Centre Meet,Mango News,Mango News Telugu,Union Home Minister Called Farmers For Talks Today At 7 PM,Union Home Minister,Amit Shah,Union Home Minister Amit Shah,Union Home Minister Amit Shah Called Farmers For Talks,Union Home Minister Amit Shah Talks Today At 7 PM,Union Home Minister Amit Shah Calls Farmers Meet At 7 PM,Farmers Protest

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న రైతులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చర్చలకు ఆహ్వానించారు. భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్‌ టికైట్ మాట్లాడుతూ “చర్చలకు రావాలని అమిత్ షా నుంచి నాకు ఫోన్ వచ్చింది. మంగళవారం సాయంత్రం 7 గంటలకు సమావేశం కావాలని కోరారు. సింఘ సరిహద్దు నుంచి హోం మంత్రి అమిత్ షాతో చర్చలకు జరిపేందుకు వెళ్తాము” అని పేర్కొన్నారు. ఇప్పటికే 5 సార్లు జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో బుధవారం నాడు కేంద్ర మంత్రులు, రైతు సంఘాల మధ్య ఆరో రౌండ్ చర్చలకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందుగానే అమిత్ షా చర్చలకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్‌ బంద్‌‌ ప్రశాంతంగా ముగిసింది. 24 కీలక రాజకీయ పార్టీలు రైతుల భారత్ బంద్ కు మద్దతు తెలిపి దేశంలో అనేక ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − fifteen =