ముఖ్రా కె గ్రామం ఓడిఎఫ్ ప్లస్ గా ఎంపిక అవ్వడం తెలంగాణకే గర్వకారణం: సీఎం కేసీఆర్

CM KCR Appreciated Mukhra K Village Over Getting ODF Plus Status,CM KCR,KCR,CM KCR Appreciated Mukhra K Village,ODF Plus Status,KCR Appreciated Mukhra K Village Over Getting ODF Plus Status,Mango News,Mango News Telugu,CM KCR Appreciates Mukhra K Village For ODF Plus Status,Mukhra Village in Adilabad Selected for ODF,CM KCR Congratulates Villagers,Mukhra village in Adilabad Selected For ODF,Mukhra K village in Adilabad District,Open Defecation Free Plus,Mukhra Village Selected For ODF,Mango News,Mango News Telugu,CM KCR Appreciated Mukhra K Village Over Getting ODF Plus

తెలంగాణలోనే నూటికి నూరు శాతం బహిరంగ మల విసర్జన రహిత (ఓపెన్ డేఫికేషన్ ఫ్రీ (ఓడిఎఫ్) స్టేటస్) హోదాను సాధించిన ఏకైక గ్రామ పంచాయతిగా అదిలాబాద్ జిల్లాకు చెందిన ముఖ్రా కె గ్రామాన్ని కేంద్ర జలవనరుల శాఖ స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ఆ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ తదితర ప్రజా ప్రతినిధులు సోమవారం నాడు ప్రగతి భవన్ లో కలిసారు. ముఖ్రా కె గ్రామం ఓడిఎఫ్ ప్లస్ గ్రామంగా ఎంపిక అవ్వడం మన తెలంగాణకే గర్వకారణం అని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

‘‘నేను కన్న కలలు మీ గ్రామం ద్వారా నిజమవుతున్నాయి‘‘ అని ముఖ్రా కె సర్పంచ్ గాడ్గె మినాక్షిని, అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. గ్రామంలో 100% మొక్కలు బ్రతకడం చాలా ఆనందమని, సేంద్రీయ ఎరువులు తయారుచేస్తున్న తొలి గ్రామం ముఖ్రా కె కావడం అభినందనీయం అని, ప్రతి పల్లె ముఖ్రా కె లాగా తయారు అవ్వాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + one =