యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్-2021 ఫైనల్ ఫలితాలు విడుదల

UPSC Civil Services-2021 Final Results Declared Today, Union Public Service Commission has announced the final results for the UPSC Civil Services exam 2021, UPSC Civil Services exam 2021, Union Public Service Commission has announced the final results, UPSC Civil Services-2021 Final Results, Union Public Service Commission, UPSC Civil Service final result 2021 declared, Shruti Sharma is the topper, Shruti Sharma is the topper For UPSC Civil Services exam 2021, 2021 UPSC Civil Services exam, Shruti Sharma is the topper For 2021 UPSC Civil Services exam, UPSC Civil Services Final Result , UPSC Result 2021, UPSC Civil Services 2021 Final Results News, UPSC Civil Services 2021 Final Results Latest News, UPSC Civil Services 2021 Final Results Latest Updates, UPSC Civil Services 2021 Final Results Live Updates, Mango News, Mango News Telugu,

సివిల్‌ సర్వీసెస్-2022 ఫైనల్ ఫలితాలను మే 30, సోమవారం ఉదయం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) విడుదల చేసింది. ముందుగా సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఏ), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) మరియు ఇతర సెంట్రల్ సర్వీసెస్ లలో ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూ కోసం మొత్తం 1823 మంది అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేయబడ్డారు.

2022 జనవరిలో యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ మెయిన్స్-2021 పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ కోసం ఏప్రిల్-మే, 2022లో నిర్వహించిన ఇంటర్వ్యూల ఫలితాల ఆధారంగా తాజాగా మొత్తం 685 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. ఇందులో 244 మంది జనరల్, 73 మంది ఈడబ్ల్యూఎస్, 203 మంది ఓబీసీ,105 మంది ఎస్సీ, 60 మంది ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఉన్నట్టు తెలిపారు. అలాగే ఐఏఎస్ 180, ఐఎఫ్ఏ కు 37, ఐపీఎస్ కు 200, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఏ కోసం 242, గ్రూపు-బి సర్వీస్ కోసం 90 మంది ఎంపికైనట్టు తెలిపారు.

ఫైనల్ జాబితాను అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లో అందుబాటులో ఉంచారు. సివిల్ సర్వీసెస్-2021 లో శృతి శర్మ మొదటి ర్యాంకు, అంకిత అగర్వాల్ రెండో ర్యాంకు, గామిని సింగ్లా మూడవ ర్యాంకు సాధించారు. మరోవైపు సివిల్స్ తుది ఫలితాల్లో మరోసారి 20 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. అందులో యశ్వంత్‌కుమార్‌రెడ్డి (15వ ర్యాంకు), పూసపాటి సాహిత్య (24వ ర్యాంకు), కొప్పిశెట్టి కిరణ్మయి (56వ ర్యాంకు), శ్రీ పూజ (62వ ర్యాంకు), గడ్డం సుధీర్‌కుమార్‌రెడ్డి (69), ఆకునూరి నరేశ్ (117వ ర్యాంకు), అరుగుల స్నేహ (136వ ర్యాంకు) సాధించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 6 =