మే 30 నుండి జూన్ 7 వరకు గాబోన్, సెనెగల్, ఖతార్‌ దేశాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన

Vice President Venkaiah Naidu Visit to Gabon Senegal and Qatar from May 30 to June 7, Vice President Venkaiah Naidu Visit to Gabon from May 30 to June 7, Vice President Venkaiah Naidu Visit to Qatar from May 30 to June 7, Vice President Venkaiah Naidu Visit to Senegal from May 30 to June 7, Vice President Venkaiah Naidu three-nation tour, Venkaiah Naidu three-nation tour, VP Venkaiah Naidu three-nation tour, three-nation tour, Gabon, Senegal, Qatar, May 30 to June 7, Vice President Venkaiah Naidu will be on a nine day visit to Gabon Senegal and Qatar from today, VP Venkaiah Naidu three-nation tour News, VP Venkaiah Naidu three-nation tour Latest News, VP Venkaiah Naidu three-nation tour Latest Updates, VP Venkaiah Naidu three-nation tour Live Updates, Mango News, Mango News Telugu,

భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మే 30వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు 2022 వరకు గాబోన్, సెనెగల్ మరియు ఖతార్‌ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ మూడు దేశాల పర్యటనకు సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి వెంకయ్య నాయుడు బయలుదేరి వెళ్లారు. కాగా ఈ మూడు దేశాలను భారత ఉపరాష్ట్రపతి సందర్శించడం ఇదే తొలిసారి. అప్పటివరకు ఏ ఉప రాష్ట్రపతి ఆ దేశాల్లో అధికారిక పర్యటన చేపట్టలేదు. ఈ పర్యటనలో ఉపరాష్ట్రపతి వెంట కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డా.భారతి ప్రవీణ్ పవార్, రాజ్యసభ ఎంపీలు సుశీల్ కుమార్ మోదీ, విజయ్ పాల్ సింగ్ తోమర్, లోక్ సభ ఎంపీ పి.రవీంద్రనాథ్ మరియు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వెళ్తున్నారు.

మే 30 నుండి జూన్ 1 వరకు వెంకయ్య నాయుడు గాబోన్‌ లో పర్యటించనున్నారు. గాబోన్‌ ప్రధాన మంత్రి రోజ్ క్రిస్టియానే ఒస్సౌకా రాపొండాతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే గాబోన్ ప్రెసిడెంట్ అలీ బొంగో ఒండింబా మరియు ఇతర ప్రముఖులను కలుసుకోనున్నారు. గాబోన్‌లోని బిజినెస్ కమ్యూనిటీతో సమావేశం కానున్నారు, అలాగే అక్కడి భారతీయ ప్రవాసులను ఉద్దేశించి కూడా వెంకయ్య నాయుడు ప్రసంగించే అవకాశం ఉంది. ఇక జూన్ 1 నుంచి 3 వరకు సెనెగల్‌ లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా సెనెగల్ ప్రెసిడెంట్ మాకీ సాల్ తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. అనంతరం నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ మౌస్తఫా నియాస్సే మరియు ఇతర ప్రముఖులను కలుసుకోనున్నారు. కాగా ఈ సంవత్సరమే భారత్ మరియు సెనెగల్ దౌత్య సంబంధాల స్థాపన 60వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం గమనార్హం. వెంకయ్య నాయుడు సెనెగల్ లో బిజినెస్ రౌండ్‌టేబుల్‌కు హాజరవడంతో పాటుగా, భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఈ పర్యటనలో చివరిగా జూన్ 4 నుంచి 7 వరకు వెంకయ్య నాయుడు ఖతార్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఖతార్ డిప్యూటీ అమీర్, షేక్ అబ్దుల్లా బిన్ హమద్ అల్ థానీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరపడంతో పాటుగా ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షిస్తారు. ఈ పర్యటనలో పలువురు ఇతర ఖతార్ ప్రముఖులను కూడా కలుసుకుంటారు మరియు ఖతార్‌లో బిజినెస్ రౌండ్‌టేబుల్‌ లో ప్రసంగిస్తారు. కాగా గత రెండేళ్లలో ఖతార్ వివిధ భారతీయ కంపెనీల్లో 2 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టడం గమనార్హం. పర్యటన చివరి రోజున, ఉపరాష్ట్రపతి పర్యటన గుర్తుగా కమ్యూనిటీ రిసెప్షన్ జరుగనుంది. అక్కడ ఖతార్‌లోని భారతీయ కమ్యూనిటీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మరోవైపు ఖతార్‌ లో ప్రస్తుతం 7,50,000 మంది ప్రవాస భారతీయలు ఉన్నట్లుగా తెలుస్తుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 7 =