ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఘనవిజయం సాధించిన బీజేపీ

Uttarakhand Assembly Election Results-2022, Grand Victory for BJP, BJP Set to Return to Power, Uttarakhand Assembly Election Results 2022 Live Updates, Poll Results of Uttarakhand, Poll Results of Uttarakhand 2022 Assembly Elections, Counting of Votes 2022 Assembly Elections Results Live Updates, Assembly Elections-2022, Uttarakhand Assembly Election Results 2022, Election 2022, Assembly Election, Assembly Election 2022, 2022 Assembly Election, Assembly Elections, Assembly Elections Latest News, Assembly Elections Latest Updates, Assembly Elections Live Updates, 2022 Assembly Elections, Assembly Elections, Elections, Mango News, Mango News Telugu,

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించింది. వరుసగా రెండోసారి కూడా ఉత్తరాఖండ్ ప్రజలు బీజేపీ పాలనకే పట్టంకట్టారు. గత ఐదు సంవత్సరాల్లో ఉత్తరాఖండ్ లో పలు కారణాల దృష్ట్యా బీజేపీ అధిష్టానం ముగ్గురు సీఎంలను మార్చిన కూడా ప్రజలు బీజేపీ వైపే మొగ్గుచూపారు. ఈసారి ఉత్తరాఖండ్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడిన కూడా బీజేపీ ముందు నిలువలేకపోయింది. ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను సీఎం పీఠం దక్కించుకునేందుకు 36 స్థానాలు దక్కించుకోవాల్సి ఉండగా, బీజేపీ 48 (గెలుపు+ఆధిక్యం) స్థానాల్లో సత్తా చాటింది. స్పష్టమైన మెజారిటీతో రాష్ట్రంలో బీజేపీ మరోసారి అధికారాన్ని చేపట్టనుంది. కాగా కాంగ్రెస్ 18 (గెలుపు+ఆధిక్యం) స్థానాలు దక్కించుకుంది. బీఎస్పీ 2, ఇతరులు 2 స్థానాలు దక్కించుకోగా, ఎన్నికల ముందు కొద్దిగా అంచనాలు కలిగించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోతుంది.

అయితే ఖతిమా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఓడిపోయారు. ఈ స్థానంలో మొదటి నుంచే పుష్కర్ సింగ్ ధామీ వెనుకంజలో ఉన్నారు. చివరకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన భువన్ చంద్ర కప్రీ చేతిలో 6,579 ఓట్ల తేడాతో పుష్కర్ సింగ్ ధామీ ఓడిపోయారు. పార్టీ ఘనవిజయం సాధించి, సీఎం ఓడిపోవడంతో కార్యకర్తలు కొంత నిరాశ చెందారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కీలక నేత హరీష్ రావత్ కూడా లాల్కువాన్ అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు. మరోవైపు ఉత్తరాఖండ్ తదుపరి సీఎంగా బీజేపీ అధిష్టానం ఎవరికీ అవకాశమిస్తుందనే అంశంపై అందరిలో ఆసక్తి నెలకుంది.

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: (గెలుపు+ఆధిక్యం):

  • బీజేపీ : 48
  • కాంగ్రెస్ : 18
  • బీఎస్పీ : 2
  • ఇతరులు : 2
  • ఆప్: 0
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =