వెస్టిండీస్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ కీలక నిర్ణయం, వైట్‌ బాల్‌ కెప్టెన్సీకి గుడ్‌బై

West Indies Skipper Nicholas Pooran Steps Down As White-Ball Captain After T20 World Cup Debacle,West Indies Captain Nicholas Pooran, Step Down From White-Ball Captaincy,West Indies Skipper Nicholas Pooran ,Nicholas Pooran,Mango News,Mango News Telugu,Nicholas Pooran Latest News And Updates,T20 World Cup Debacle,T20 World Cup, West Indies Cricket Team,T20 World Cup West Indies,West Indies Cricket Team 2022,West Indies Cricket News And Updates,West Indies,Nicholas Pooran Captain 2022,Nicholas Pooran Former Captain,Former Captain Nicholas Pooran

వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ నికోలస్ పూరన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు పూరన్ ప్రముఖ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు దారుణ ప్రదర్శన చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో టీ20 ప్రపంచకప్‌లో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ జట్టు పసికూనలైన స్కాట్లాండ్ మరియు ఐర్లాండ్ జట్లపై దారుణ పరాజయం పాలైంది. తద్వారా క్వాలిఫయర్స్ దశలోనే నుంచి నిష్క్రమించింది. ఇది క్రికెట్ ప్రేమికులను షాక్ కి గురి చేసింది. అలాగే ప్రపంచ కప్‌లో వ్యక్తిగతంగా కూడా పూరన్ పేలవ ఫామ్ కనబరిచాడు. దీంతో అన్నివైపుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే పూరన్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం తెలిపాడు.

‘ఇది నేను వదులుకోవడం కాదు. ఇప్పటికీ వెస్టిండీస్ క్రికెట్ కెప్టెన్సీని నాకు లభించిన గౌరవంగా చూస్తున్నాను. నేను వెస్టిండీస్ క్రికెట్‌కు పూర్తిగా కట్టుబడి ఉన్నాననడంలో సందేహం లేదు. ఇకపై సహాయక పాత్రలో సీనియర్ ఆటగాడిగా నా సేవలను అందించడానికి నేను ఎదురుచూస్తున్నాను. వెస్టిండీస్ వైట్ బాల్ కెప్టెన్‌గా ఇప్పుడు వైదొలగడం ద్వారా ఇది జట్టుకు మరియు వ్యక్తిగతంగా నాకు మంచి ప్రయోజనాలను కలిగిస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక ఆటగాడిగా నేను జట్టుకు ఏమి అందించగలనో దానిపై దృష్టి పెట్టడమే నా మొదటి లక్ష్యం. జట్టుగా మేము విజయవంతం కావాలని నేను బలంగా కోరుకుంటున్నాను. కీలక సమయాల్లో నిలకడగా పరుగులు చేసే పాత్రపై పూర్తిగా దృష్టి సారించడం ద్వారా జట్టుకు నేను ఉపయోగపడటం నా బాధ్యత’ అని తన ప్రకటనలో పూరన్ పేర్కొన్నాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 1 =