రేపు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం వైఎస్ జగన్‌ పర్యటన

AP CM YS Jagan will Visit Narasannapeta in Srikakulam District Tomorrow

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (నవంబర్ 23, బుధవారం) శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష (రీ సర్వే) రెండో విడత కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ముందుగా బుధవారం ఉదయం 8.30 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకోనున్నారు. 11.00-12.55 గంటల సమయంలో సీఎం బహిరంగ సభలో పాల్గొని, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం చేరుకుంటారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా జిల్లా నేతలు, స్థానిక నాయకులు, అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here