ఇజ్రాయిల్ ఎన్నికల్లో ఘన విజయం సాాధించిన బెంజమిన్ నెతన్యాహును అభినందించిన ప్రధాని మోదీ

PM Modi Congratulates Benjamin Netanyahu for his Success in Israeli General Elections, Israeli General Elections, PM Modi Congratulates Benjamin Netanyahu for his Success, Benjamin Netanyahu Won In Israeli General Elections, 2022 Israeli General Elections, Israeli General Elections 2022, PM congratulates Benjamin Netanyahu, Prime Minister Narendra Modi, Benjamin Netanyahu victory On Israeli General Elections, Israeli General Elections News, Israeli General Elections Latest News And Updates, Israeli General Elections Live Updates, Mango News, Mango News Telugu

ఇజ్రాయెల్ దేశ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు బెంజమిన్ నెతన్యాహును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో విజయానికి ‘మాజెల్ తోవ్ మై ఫ్రెండ్’ అంటూ నెతన్యాహుకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు ఇరుదేశాల ఉమ్మడి ప్రయత్నాలను కొనసాగించాలని ఎదురుచూస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇచ్చినందుకు కేర్ టేకర్ ప్రధాని యయిర్ లాపిడ్ కు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనం కోసం ఫలవంతమైన ఆలోచనల మార్పిడిని కొనసాగించాలని ఆశిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు.

ఇజ్రాయిల్ దేశంలో జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మెజారిటీ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్నారు. పార్లమెంటులోని 120 సీట్లలో నెతన్యాహు స్వంత లికుడ్ పార్టీ 32 సీట్లు గెలుచుకోగా, రైట్ వింగ్ మిత్రపక్షాలతో కలిపి మొత్తం 64 స్థానాలను గెలుచుకున్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి యయిర్ లాపిడ్ గురువారం సార్వత్రిక ఎన్నికలలో ఓటమిని అంగీకరించి, ప్రతిపక్ష నాయకుడు నెతన్యాహును అభినందించారు. దీంతో ఇజ్రాయెల్ నూతన ప్రధానమంత్రిగా బెంజిమన్ నెతన్యాహు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇజ్రాయిల్ లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నెతన్యాహు ప్రత్యేక గుర్తింపు పొందాడు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 8 =