ఆత్మసాక్షి సంచలన సర్వే..

Atmasakshi Sensational Survey,Atmasakshi,Atmasakshi Survey,Sensational Survey,Mango News,Mango News Telugu,Election Survey,Analyst Sudhakar About Atma Sakshi,Sensational Survey On AP Politics,Election Survey, Atmasakshi Survey, YCP Leader, TDP , Jana Sena ,Alliance, 2019 Elections, 2024 Elections,Atmasakshi Survey Latest News,Atmasakshi Survey Latest Updates,Atmasakshi Survey Live News

వైనాట్ 175 అంటూ ప్రతి సభలోనూ, పార్టీ క్యాడర్‌ దగ్గర పదే పదే చెబుతూ వస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆత్మసాక్షి సర్వే గట్టి షాక్ ఇచ్చినట్లు అయింది. ఇప్పటికే కొన్ని సర్వేలు మళ్లీ అధికారం జగన్‌దే అని చెబుతుంటే ఈ ఆత్మసాక్షి సర్వే ఏంటి రివర్స్‌లో చెబుతోందంటూ వైసీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆత్మసాక్షి చెప్పిన సర్వే ఫలితాలు.. 2019 ఎన్నికల్లో 95 శాతం నిజం అవడంతో..వైసీపీ వర్గాలలో కొత్త భయం పట్టుకుంది. ఇంకా చెప్పాలంటే ఆత్మసాక్షి సర్వే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

గత ఎన్నికల్లో నూరు శాతం నిజమైన ఫలితాలను ఇచ్చిన ఆత్మసాక్షి సర్వే.. ఇప్పుడు రాబోయే ఎన్నికలపై సర్వే ఫలితాలను వెల్లడించింది. తమ సర్వే ఫలితాల ద్వారా రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో బయటపెట్టింది. హైదరాబాద్‌ వేదికగా పని చేస్తున్న ఈ ఇండియన్ పొలిటికల్ సర్వే అండ్ స్ట్రాటజీ టీమ్.. ఆంధ్రప్రదేశ్‌లోని మారు మూల గ్రామాల నుంచి కూడా వివరాలను సేకరించి సర్వే నిర్వహించింది.

నాలుగు రకాలుగా ఆత్మసాక్షి సర్వే ..తన సర్వను నిర్వహించింది. వైసీపీ,టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి.అలాగే టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయి? అదే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయి. మరోవైపు టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటాయంటూ చేసిన వివరాలను..ఆత్మసాక్షి సర్వే ప్రకటించింది. ఆప్షన్-1 ప్రకారం టీడీపీ, వైసీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేస్తే.. టీడీపీకి 86, వైసీపీకి 68, జనసేనకు మాత్రం కేవలం 6 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది.

ఇక ఆప్షన్-2 ప్రకారం చూస్తే.. టీడీపీ, జనసేన కలిసి కూటమిగా కనుక పోటీ చేస్తే.. టీడీపీకి 95 సీట్లు రాగా, జనసేనకు 13 సీట్లు వస్తాయని .. అప్పుడు వైసీపీ 60 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెప్పింది. 7 స్థానాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని సర్వే తేల్చింది. అందుకే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే..వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది.
అలాగే ఆప్షన్-3 ప్రకారం చూసుకుంటే.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిపోయి..కూటమిగా పోటీ చేస్తే మాత్రం.. వైసీపీ లాభపడుతుందని ఆత్మసాక్షి సర్వే తెలిపింది. ఈ కూటమికి 70-75 సీట్లు మాత్రమే రాగా.. వైసీపీకి మాత్రం 98-100 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది.
ఇక ఆప్షన్-4 ప్రకారం చూస్తే.. టీడీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తే మాత్రం ఎక్కువ స్థానాలు గెలుస్తుందని ఆత్మసాక్షి సర్వే చెబుతోంది. ఈ ముగ్గురి కూటమికి 115 నుంచి 122 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. వైసీపీ మాత్రం 56 నుంచి 58 స్థానాలకే పరిమితం కావాల్సి ఉంటుందని తెలిపింది.

ఇప్పుడు ఆత్మసాక్షి బయటపెట్టిన లెక్కలతో.. మరోసారి గత ఎన్నికల ఆత్మసాక్షి ఫలితాలను నెట్టింట తిరగదోడుతున్నారు నెటిజన్లు. 2019 ఎన్నికల్లో ఆత్మసాక్షి సర్వే అక్షరాలా 95 శాతం నిజమైందన్న విషయాన్ని తెలుసుకుంటున్నారు.అప్పుడు వైసీపీ 139 నుంచి 142 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పిన సర్వే.. టీడీపీ 22 నుంచి 28 స్థానాలకు పరిమితం అవుతుందని తేల్చింది. ఇక జనసేనకు 0-2 సీట్లు మాత్రమే వస్తాయని అప్పటి సర్వేలో చెప్పింది.

అయితే 2019 ఫలితాలు ఆత్మసాక్షి ఫలితాలను 95శాతానికి పైగా నిజం చేస్తూ.. వైసీపీకి 151, టీడీపీకి 23 సీట్లు వచ్చాయి.ఇక జనసేన ఒక్కచోట మాత్రమే విజయం సాధించింది.కానీ అప్పటికి జనసేన పార్టీ పెద్దగా ప్రజల్లోకి చొచ్చుకుని పోలేదు. కానీ ఇప్పుడు జనసేనాని లెక్కలు మార్చారు.. రూటు మార్చారు. కాబట్టి ఏపీ ఎన్నికల ఫలితాలను మార్చే చక్రం కేవలం పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉన్నట్లు కూడా ఆత్మసాక్షి చెబుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =