శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పట్టుకొని రోదించిన మహిళలు

Women crying holding Shivraj Singh Chauhan,Women crying holding Shivraj,Shivraj Singh Chauhan,shivaraj singh chauhan, Madyapradesh, MP, BJP, MP Assembly elections,Mango News,Mango News Telugu,Shivraj Singh Chouhan in Tears,Former Madhya Pradesh CM Shivraj Singh,shivaraj singh chauhan Latest News,shivaraj singh chauhan Latest Updates,shivaraj singh chauhan Live News
shivaraj singh chauhan, Madyapradesh, MP, BJP, MP Assembly elections

కొందరు నేతలు ఓడిపోవాలని జనాలు కోరుకుంటారు. కొందర్ని పట్టుపట్టిమరీ ఓడిస్తారు. మరికొందర్ని మాత్రం హక్కున చేర్చుకుంటుంటారు. గెలిపించుకొని తీరుతారు. అలా గెలిపించుకున్న తమ నేతకు సరైన పదవి దక్కకపోతే.. వారి బాధ మరోలా ఉంటుంది.  ఇలానే ఓట్లు వేసి గెలిపించుకున్న తమ నేతకు సరైన పదవి దక్కకపోవడంతో.. ప్రజలంతా కన్నీరుపెట్టుకున్నారు. పెద్ద ఎత్తున ఆ నాయకుడి వద్దకు తరలివెళ్లారు. అతను మరెవరో కాదు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్‌లో కూడా ఇటీవల ఎన్నికలు జరిగాయి. అక్కడ మరోసారి భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కనీవినీ ఎరుగని రీతిలో బీజేపీ అక్కడ విజయం సాధించింది. అయితే బీజేపీ గెలుపొందడంతో.. మళ్లీ శివరాజ్ సింగ్ చౌహనే తమ ముఖ్యమంత్రి అని అక్కడి ప్రజలు భావించారు. ఆటు శివరాజ్ కూడా తానే ముఖ్యమంత్రి అని భావించారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. బీజేపీ హైకమాండ్ ఒక్కసారిగా ప్లేట్ మార్చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్‌కు షాక్ ఇచ్చింది. ముఖ్యంత్రి పదవి కాదు కద.. కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు.

నిజానికి మధ్యప్రదేశ్‌లో బీజేపీ గెలుపొందడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంత గానో కృషి చేశారు. శాయశక్తులా ప్రయత్నించి మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ హైకమాండ్ మాత్రం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కాదని.. మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది.  ఇటీవలే మోహన్ యాదవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు.

అయితే శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పక్కన పెట్టి.. మోహన్ యాదవ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడాన్ని అక్కడి మహిళలు తట్టుకోలేకపోతున్నారు. కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇటీవల పెద్ద ఎత్తున మహిళలు శివరాజ్ సింగ్ చౌహాన్‌ను వెతుక్కుంటూ ఆయన వద్దకి వెళ్లారు.  మా సీఎం మీరేనంటూ.. శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పట్టుకొని రోదించారు. ఆయన్ను చూసే ఓటేసి బీజేపీని గెలిపించామని విలపించారు. ఈ ఘటనంతా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట్లో వైరలవుతోంది. అభిమానమంటే ఇది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 2 =