బీజేపీ దళం స్కెచ్ వేస్తే అంతే మరి..

Will Modi Contest From Telangana,Will Modi Contest,Contest From Telangana,Modi contest from Telangana, BJP forces, BJP sketch, Assembly Elections in Telangana, Contest, BRS, Congress and BJP,Mango News,Mango News Telugu,Assembly Elections in Telangana Latest News,Assembly Elections in Telangana Latest Updates,Rahul Gandhi accuses PM Modi,BJP Latest News,BJP Latest Updates,BJP Live News,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News
Modi contest from Telangana, BJP forces, BJP sketch, assembly elections in Telangana, contest, BRS, Congress and BJP

తెలంగాణలో రీసెంటుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్,కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ బీజేపీ కొన్ని చోట్ల పుంజుకున్నా.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు దీటుగా ఎక్కడా కూడా నిలబడలేకపోయింది. దీనకి కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వంటి నిర్ణయాలు ఉండటమేనని తెలుస్తోంది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకున్న వ్యతిరేకతను కాంగ్రెస్ తమకు అనుకూలంగా మల్చుకున్నంత బాగా బీజేపీ మలచుకోలేకపోయింది. దీంతో  టఫ్ ఫైట్‌లో చివరకు కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే గుడ్డిలో మెల్లగా తెలంగాణలో గతంతో పోల్చుకుంటే ఈ సారి సీట్లు  4 నుంచి  8 స్ధానాలకు పెరగడం కమలం దళంలో మళ్లీ ఆశలు పెరిగాయి.

దేశాన్ని ఇప్పటికే రెండుసార్లు పరిపాలించిన కాషాయ పార్టీని ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టించడానికి  పట్టుదలగా ముందుకు వెళ్తున్నారు కమలం నేతలు. తాజాగా 5 రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో.. ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పుంజకోకపోవడంతో పాటు ప్రతిపక్షాల పొత్తు ఇంకా బాలరిస్టాల దశను దాటకపోవడం ఇప్పుడు బీజేపీకి ప్లస్‌గా మారింది. దీంతో పాటు ఇప్పుడున్న పరిస్థితులలో ప్రధాని మోడీకి గట్టి పోటీ ఇచ్చేవాళ్లు  కూడా కనుచూపు మేరలో ఎవరూ కనిపించడం లేదన్న వాదన నడుస్తోంది.

ముఖ్యంగా  ఈ  అసెంబ్లీ ఎన్నికలలో రెండు రాష్ట్రాలు తప్ప మిగిలిన  మూడు రాష్ట్రాలను  ఏకపక్షంగా గెలుచుకోవడంతో బీజేపీ మరింత పెరిగినట్లుగా కనిపిస్తున్న వాతావరణం కనిపిస్తుంది . అయితే ఉత్తరాదిన ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి మాత్రం అంత అనుకూలంగా లేనట్లే కనిపిస్తోంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 8 అసెంబ్లీ స్థానాలతో పాటు.. దాదాపు 12 శాతం ఓటు బ్యాంకును పొందడంతో ఇప్పుడు తెలంగాణపై కేంద్రంలోని పెద్దలు తెలంగాణపై ఫోకస్ పెంచినట్లు  తెలుస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమ బలం పుంజుకోవడానికి ఇదే సరయిన సమయమని బీజేపీ దళం బావిస్తున్నట్టుగా తెలుస్తోంది .

ముఖ్యంగా కర్ణాటక తర్వాత  తెలంగాణ తమకు కంచుకోటగా మారే అవకాశం ఉందని అంచనాకు వచ్చిన కమలం దళం, వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో  మోడీని తెలంగాణ నుంచి పోటీ చేయించడానికి సమాయత్తం అవుతున్నట్లు  తెలుస్తుంది. తెలంగాణలో  అతిపెద్దదైన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రధాని మోడీ పోటీ చేస్తే.. ఆ ప్రభావం తెలంగాణ  అంతటా ఉంటుందని..దీంతో  బీఆరఎస్ నుంచి బీజేపీలోకి వలసలు వచ్చేవాళ్లు కూడా ఉండే అవకాశం ఉందని కాషాయదళం  అంచనా వేస్తుందట.

ముఖ్యంగాఇప్పుడు బీఆర్ఎస్ బలహీనంగా ఉంది కాబట్టి.. ఇలాంటి సమయంలోనే ప్రధాన ప్రతిపక్షాన్ని హైజాక్ చేయాలంటే మోడీ లాంటి దీటైన నాయకుడు అవసరమని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది . ఇప్పటికే బీజేపీ దళం సూచనప్రాయంగా ఈ విషయాన్ని మోడీ ముందు ఉంచగా..పీఎం ఈ ప్రతిపాదనను అంగీకరించారని, పూర్తిస్థాయి సమీక్ష తర్వాత మోడీ పోటీ నిర్ణయం ఫైనల్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. మోడీ హవాతో తెలంగాణతో పాటు ప్రక్కనే ఉన్న కర్ణాటక, ఏపీ కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉందన్నది బీజేపీ వ్యూహ కర్తల ఆలోచనగా తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − ten =