మీ ఫోన్ హ్యాక్ అయితే ఈ సంకేతాలు కనిపిస్తాయట..

If Your Phone Is Hacked Then These Signs Will Appear,If Your Phone Is Hacked,These Signs Will Appear,Phone Is Hacked,Mango News,Mango News Telugu,Your Phone Hacked, Facebook, Instagram, How to Know Your Phone Hacked, Apple Iphones Hacked,These Symptoms Are Very Dangerous on the Phone, Phone Is Hacked,Signs Your Phone Has Been Hacked,Phone Hacked Signs Latest News,Phone Hacked Signs Latest Updates
Your Phone Hacked, Facebook, Instagram, How to Know Your Phone Hacked, Apple iPhones Hacked,These symptoms are very dangerous on the phone, phone is hacked,

ఈ మధ్య  ఫోన్ హ్యాక్ అయిందని..అలాగే  మీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు జాగ్రత్త అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరకు కూడా ఈ కేసులే ఎక్కువగా వస్తున్నాయి. చివరకు రాజకీయ నేతలు కూడా తమ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్న వార్తలే  ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్లను టార్గెట్ చేసుకుని ‘స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్‌లు’ ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై ఇప్పటికే ఆపిల్ కంపెనీ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ ప్రకటనలో మీ ఫోన్‌లలో హైడ్ అయిన కొన్ని కొత్త యాప్‌ల ద్వారానే ఈ ట్యాపింగ్ జరుగుతుందని ఆపిల్ హెచ్చరించింది. అయితే ఫోన్‌లో కనిపించే కొన్ని సంకేతాలతో  ఫోన్ హ్యాక్ అయిందని  గుర్తించి వెంటనే అప్రమత్తం అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా మీ ఫోన్ హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవడానికి.. బ్యాటరీ కండిషన్ ఎలా ఉందో చెక్ చేయాలి.  ఫోన్ బ్యాటరీ నార్మల్ కంటే  వేగంగా అయిపోతుంటే అప్రమ త్తం కావాల్సిందే. కొన్ని మాల్వేర్ లేదా మోసపూరిత యాప్‌లు ఎక్కువ ఛార్జింగ్‌ను వాడుకుంటాయి. అలా  బ్యాక్ ‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్‌లు ఉంటే మీ ఫోన్ బ్యాటరీని తినేస్తాయి. అందుకే బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలాంటి యాప్‌లు ఉన్నాయో చెక్ చేసి లేవని  నిర్ధారించుకోవాలి.

అలాగే ఫోన్ వేగంగా వేడెక్కుతున్నా కూడా అనుమానించాల్సిందే. గేమింగ్ లేదా సినిమాలు చూస్తున్నప్పుడు ఎక్కువ సమయం మాట్లాడినప్పుడు సాధారణంగా ఫోన్లు వేడెక్కుతుంటాయి. అయితే ఏమీ చేయకుండానే  ఫోన్ వేడెక్కుతున్నట్లయితే.. ఆ ఫోన్‌ను హ్యాకర్లు కంట్రోల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయనే అర్ధం.

అంతేకాదు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ వంటి లింక్ చేసిన అకౌంట్లలో అన్ నోన్ యాక్టివిటీ కనిపిస్తే  ఫోన్ హ్యాక్ అయినట్లే. మీ అకౌంట్లో మీరు చేసిన పోస్టులు కాకుండా..మీకు తెలియని పోస్టులు మీ అకౌంట్లలలో చూసినట్లయితే జాగ్రత్త పడాలి . అది ఫోన్ హ్యాక్ అయిందని సంకేతం కూడా కావొచ్చు.అలాగే మీ ఫోను నుంచి ఈ మెయిల్స్ సెండ్ అవకపోయినా.. లేదా ఎవరైనా పంపిన మెయిల్స్ మీ ఫోన్‌కు రాకపోయినా  హ్యాకర్లు మీ డివైజ్ హ్యాక్ చేశారని అర్థం చేసుకోవాలి.

అలాగే ఫోన్ తరచుగా క్రాష్ అవుతున్నా కూడా అనుమానించాల్సిందే.  యాప్‌లు తరచూ క్రాష్ అవడం,  లోడ్ అవ్వడంలో ఫెయిల్ అవడం అంటే సడన్‌గా రీబూట్ అవడం, షట్ డౌన్  అవడం, రీస్టార్ట్ అవడం,స్క్రీన్ లైటింగ్‌లలో మార్పులు కనిపిస్తే ఏదైనా మాల్వేర్ ఉన్నట్లే అర్ధం. సడన్ గా మొబైల్ డేటా వినియోగం పెరిగినా కూడా బ్యాక్ డ్రాప్ యాప్స్ ఉన్నట్లే అనుమానించాలి.

అంతేకాదు ఫోన్‌లో మాల్‌వేర్ పాప్-అప్స్ కనిపిస్తే  ఫోన్ చెక్  చేసుకోవాలి.  ఫేక్ వైరస్ వార్నింగ్, మెసేజ్ పుష్ నోటిఫికేషన్‌లు  వస్తే అజాగ్రత్తగా ఉండొద్దు.  అలాంటి నోటిఫికేషన్‌లను అసలు ట్యాప్ చేయకూడదు.అలాగే  మీ గ్యాలరీలో గుర్తుతెలియని ఫొటోలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. ఫోన్ ఫ్లాష్ లైట్ సడన్‌గా ఆన్ అయినా హ్యాక్ అయినట్లే. అలా చేస్తే డివైజ్‌ రిమోట్‌గా కంట్రోల్ చేస్తున్నట్లు అర్ధం.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − one =