విద్యార్థులకు ఈ కార్డ్‌ వల్ల ఉపయోగం ఏంటి?

What is the use of Apar card for students,What is the use of Apar card,Apar card for students,Apaar Card,Apar ID,Enormous card descriptive name,What is Apar Card, the use of Apar card, students,Mango News,Mango News Telugu,Apar card use,A digital locker for students,APAAR One Nation One ID Card,Apar card for students Latest News,Apar card for students Latest Updates,Apar card for students Live News
Apaar Card,Apar ID,Enormous card descriptive name,What is Apar Card?, the use of Apar card, students

ఇప్పుడు ప్రతి ఒక్కరికి  గుర్తింపు కార్డు అయిన ఆధార్‌.. ఒక ఆధారంగా  మారిపోయింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు కోసం అపార్ కార్డు అనే ఓ గుర్తింపు కార్డును తీసుకువస్తోంది. ఇదే  ఇప్పుడు దేశంలోని ప్రతీ స్టూడెంట్‌కు గుర్తింపుకార్డుగా ఉంటుంది. ఇటీవల దేశంలో ఉన్న  విద్యార్థులందరికీ ఒకే సిలబస్ ఉండాలనే చర్చ సాగుతోంది.

దీనిలో భాగంగానే  ఒకే దేశం.. ఒకే గుర్తింపు కార్డు త్వరలో ప్రారంభం కాబోతోంది. ఆధార్ కార్డుతో పాటు, ఈ కార్డు కూడా విద్యార్థులకు ముఖ్యమైనది. ఈ కార్డ్ వన్ కంట్రీ, వన్ స్టూడెంట్ అనే కాన్సెప్ట్‌పై ఉండటం వల్ల.. భవిష్యత్తులో వివిధ పాఠశాలలు, కాలేజీల అడ్మిషన్ల నుంచి ఉద్యోగాల భర్తీ వరకు ఈ కార్డు ఉపయోగపడనుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది

వన్ నేషన్.. వన్ స్టూడెంట్ అనే కాన్సెప్ట్‌తో వచ్చిన గుర్తింపు కార్డుగా అపార్ కార్డ్  ఉంటుంది. దీనికోసం కేంద్ర విద్యాశాఖతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చొరవ తీసుకున్నాయి. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఇది ID కార్డ్‌గా గుర్తింపు పొందుతుంది. ఈ కార్డుకు ఆధార్ కార్డులాగే  ప్రత్యేక గుర్తింపు సంఖ్య కూడా ఉంటుంది. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అయిన ఈ కార్డ్ 12 అంకెలతో ఉంటుంది. ప్రతి స్టూడెంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం డిజిటల్ రూపంలో అపార్ కార్డ్‌లో నిక్షిప్తం చేయబడుతుంది.  ఒక విధంగా చెప్పాలంటే ఈ కార్డులో స్టూడెంట్ చదువకు  సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందన్న మాట.

ప్రతి స్టూడెంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం డిజిటల్ రూపంలో ‘అపార్ కార్డ్’లో భద్రపరుస్తారు. విద్యార్థి అన్ని విద్యా, క్రీడలు, స్కాలర్‌షిప్  వంటి సమస్త సమాచారం ఈ కార్డ్‌లో  ఉంటుంది. విద్యార్థి ఎంత వరకు చదివాడు. అతని విద్యాభ్యాస సమయంలో ఆ స్టూడెంట్ ఎలాంటి అవార్డులు, సర్టిఫికెట్లు పొందాడు వరంటి వారి విద్యా నాణ్యత, క్రీడా నైపుణ్యాల గురించి కూడా పూర్తి సమాచారాన్ని కలిగి ఉంటుంది. స్టూడెంట్ స్కూలు లేదా కాలేజీ  మారినప్పటికీ ఈ రికార్డ్ మాత్రం అలాగే ఉంటుంది. అలాగే ఇది ప్రతి పాఠశాలలో అతని  పూర్తి రికార్డును ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉంటారు.

అయితే అపార్ కార్డ్ నమోదు కోసం స్టూడెంట్స్ దరఖాస్తు ఫారమ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది.అపార్ కార్డ్ ఐడీ కోసం సంబంధిత వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేయాలి.    అపార్ కార్డ్ ఐడీ  కోసం ఆధార్ కార్డు నమోదు చేయడంతో పాటు.. స్టూడెంట్స్ పేరెంట్స్ యొక్క మొబైల్ నంబర్ అవసరం. విద్యార్థి పేరు, తరగతి, బ్యాచ్, స్కూలు, రాష్ట్రం  వంటి సమాచారం దరఖాస్తులో  నమోదు చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం ఈ అపార్ డిజిటల్ కార్డులు రూపొందించి 12 అంకెల అపార్ కార్డును అందజేస్తారు. స్టూడెంట్ పూర్తి పేరు, చిరునామా, ఆధార్ కార్డు వంటి ముఖ్యమైన వివరాలు ముందుగా నమోదు చేస్తారు. ఈ అపార్ కార్డ్‌లో, 12 అంకెల కార్డ్ నంబర్‌తో పాటు క్యూఆర్ కోడ్ ఉంటుంది.  దీంతోనే అపార్ కార్డు రిజిస్ట్రేషన్ అవుతుంది. అయితే ఇవన్నీ స్కూలు  లేదా సంబంధిత ఏజెన్సీలో నమోదవుతాయి. అయితే దీనివల్ల స్కూలు యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉందన్న విమర్శలు తలెత్తుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − nine =