ఫిట్స్ ఎందుకొస్తాయి?

Will The Fits Be Reduced If The Lock Is Put In,Will The Fits Be Reduced,Reduced If The Lock Is Put In,Fits Be Reduced,Mango News,Mango News Telugu,Epilepsy Causes,Cpr, Why Do Fits Occur, Lockpicks Reduce Epilepsy,Vasovagal Syncope, Carotid Sinus Syncope, Situational Syncope,Seizure Precautions,Will The Fits Be Reduced News Today,Will The Fits Be Reduced Latest Updates

చాలామంది ఉన్నట్లుండి కింద పడి .. ఫిట్స్‌తో బాధపడతారు. వీళ్లను చూస్తే చుట్టుపక్కల ఉన్నవాళ్లకు కాళ్లూ చేతులూ ఆడవు. మరికొంతమంది అయితే డాక్టర్‌ దగ్గరకు తీసుకువెళ్లడమో లేదంటే మూర్చతో బాధపడేవారి చేతిలో తాళాల గుత్తి పెట్టడమో చేస్తుంటారు. నిజానికి మెదడుకు రక్తం లేదా ఆక్సిజన్ సరఫరాలో లోపం ఏర్పడినప్పుడు కిందపడి గిలగిలా కొట్టుకుని స్పృహ కోల్పోతూ ఉంటారు. దీన్నే మూర్ఛపోవడం అంటారు. వైద్యభాషలో చెప్పాలంటే దీన్ని సాధారణంగా పాసింగ్ అవుట్ అంటారు. మూర్ఛలో మూడు రకాలు ఉంటాయట. అవి..వాసోవగల్ సింకోప్, కరోటిడ్ సైనస్ సింకోప్, సిచ్యుయేషనల్ సింకోప్. వీటిలో కొన్ని ప్రాణాపాయమైనవి కూడా అని డాక్టర్లు చెబుతున్నారు.అందుకే మన చుట్టుపక్కల ఎవరైనా మూర్ఛపోయినప్పుడు.. ఏం చేయాలో కొన్ని చిట్కాలు చెబుతున్నారు డాక్టర్లు.

మూర్ఛ లేదా ఫిట్స్‌ తరచూ వచ్చేవాళ్లలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. సడన్‌గా శరీరం వీక్‌ అయిపోవడం, మైకం కమ్మేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్లాకింగ్ అవుట్ లేదా వైటింగ్ అవుట్ కూడా అనుభవిస్తారు. నిజానికి మూర్ఛ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. భయం లేదా భావోద్వేగ గాయం,ఒత్తిడితో బాధపడేవాళ్లలో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విశ్రాంతి లేకపోవడం, లోబీపీ, డీహైడ్రేషన్‌,మధుమేహం, గుండె జబ్బు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారికి అలాగే కొన్ని ఇతర కారణాల వల్ల కూడా మూర్చ రావొచ్చు.

అప్పటివరకు మనమధ్య ఉల్లాసంగా గడిపిన వాళ్లు..సడన్‌గా ఫిట్స్‌తో అల్లాడిపోతుంటారు. దీంతో ఆ సమయంలో ఫిట్స్‌తో బాధపడుతున్నవారి చేతిలో తాళాల గుత్తి ఉంచడం, ఇనుప వస్తువులను ఉంచడం, ఉల్లిగడ్డ వాసన చూపించడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఫిట్స్‌ ఆగిపోతాయనుకుంటారు.ఐరన్ మెదడులోని అలజడిని కంట్రోల్ చేసి మూర్చను తగ్గిస్తుందని నమ్ముతారు.

కానీ నిజానికి ఇది అపోహ మాత్రమే అంటున్నారు డాక్టర్లు. సాధారణంగానే ఫిట్స్‌ లేదా మూర్ఛ అనేది 2,3 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండదట. ఈ సమయంలో ఎవరు ఏం చేసినా, చేయక పోయినా కూడా దానంతటవే మూర్చ ప్రభావం తగ్గిపోతుంది. దీన్ని స్టేటస్ ఎపిలెప్టికస్ అని డాక్టర్లు పిలుస్తారు. అయితే ఒకవేళ ఇది ఐదు నిమిషాల కంటే ఎక్కవు సేపు ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరుకు తీసుకువెళ్లి చికిత్స అందించాలి.

అయితే ఎవరైనా మూర్చతో పడిపోతే.. వారి చేతిలో తాళాల గుత్తి వంటివి పెట్టడం కాకుండా..వెంటనే వారి పాదాలను రబ్‌ చేస్తుండాలి. దీనివల్ల శరీరం చల్లబడకుండా ఉంటుంది. మూర్ఛపోయిన వ్యక్తిని వెనుకవైపు పడుకోబెట్టడం లేదా , కూర్చోబెట్టడం లాంటివి చేయాలి.అంతేకాదు పైనుంచి కింద పడటం వల్ల ముందుగా దెబ్బలు ఏమైనా తగిలాయా అనేది చూసుకోవాలి. కొన్నికొన్నిసార్లు.. వ్యక్తి శ్వాస తీసుకోవడం కానీ ఆపివేసినట్లయితే, వెంటనే వాళ్లకు సీపీఆర్ చేయాలి. అంతేకాదు కొన్నిసార్లు దెబ్బ తగలడం వల్ల ..వాళ్లు సడెన్‌ షాక్‌కి గురయ్యే అవకాశం ఉంది అందుకే వాళ్లను తట్టి లేపుతూ ఉండాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 13 =