కేసీఆర్‌ మెడకు కవిత లిక్కర్ స్కామ్..

Telangana CMs Daughters Case Before Election,Telangana CMs Daughters Case,CMs Daughters Case Before Election,Case Before Election,Mango News,Mango News Telugu,Kavitha Liquor Scam , BRS Party, ED,Kavita, Liquor Scam , KCR, CM'S Daughter, Telangana Election,Telangana CMs Daughters Case Latest News,Telangana Cms Daughters Case Latest Updates,Telangana CMs Daughters Case Live News,Telangana CM Daughter Latest News,Kalavakuntla Kavitha News,Kalavakuntla Kavitha Latest Updates,Telangana Politics, Telangana Political News And Updates

ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లోనూ రోజుకో కొత్త చర్చకు దారి తీస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ ఎప్పటికే చాలాసార్లు విచారించింది . అయినా కేసు మాత్రం ఓ కొలిక్కి రాకపోవడం పొలిటికల్ సర్కిల్‌లో ఎప్పటికప్పుడు చర్చకు దారి తీస్తుంది. అయితే కవిత ఎలాంటి కుంభకోణాలకు పాల్పడలేదని.. మోడీ ప్రభుత్వమే కక్ష పూరితంగా వ్యవహరించి ఈ కేసులోకి కవితను లాగుతోందని బీఆర్‌ఎస్ శ్రేణులు అప్పటి నుంచీ ఆరోపిస్తూనే ఉన్నారు. అటు దర్యాప్తు సంస్థలు అనుసరిస్తున్న తీరుపైన కవితా కూడా ఇప్పటికే చాలాసార్లు కోర్టును ఆశ్రయించారు.

తాజాగా మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసినపుడు ఇక కవిత అరెస్ట్ గ్యారంటీ అన్న వార్తలు గట్టిగానే వినిపించాయి. అయితే ఈడీ జారీ చేసిన నోటీసుల విషయంలో మరోసారి కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉద్దేశ పూర్వకంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నాయని తన పిటిషన్‌లో తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా ప్రధాన జడ్జిలలో ఒకరు హాజరు కాకపోవడంతో.. ఈ కేసును వచ్చే నెల 20 వరకు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. అంతే కాకుండా తదుపరి విచారణ వరకు..ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి సమన్లు కూడా జారీ చేయరాదని ఈడీని హెచ్చరించింది సర్వోన్నత న్యాయస్థానం.దీంతో కవిత కాస్త ఊరట లభించినట్లే. కానీ కవిత అరెస్ట్ కేసీఆర్‌కు పెద్ద తలనొప్పి అంటున్నారు రాజకీయ నిపుణులు.

ఓ వైపు బీజేపీ నేతల ఆరోపణల ప్రకారం కవిత అరెస్ట్ తప్పదంటున్నారు.అలాగే ఈ కేసు విషయంలో కవిత పాత్ర ఉన్నాయన్న ఢిల్లీ పెద్దల లెక్కలతో.. కవిత అరెస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇటు చూస్తే తెలంగాణలో ఎన్నికలకు కేవలం మూడు నెలలే సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో ఒకవేళ లిక్కర్ స్కామ్‌లో కనుక ఎమ్మెల్సీ కవితా అరెస్ట్ అయితే సింపతీ కంటే కూడా బీఆర్ఎస్‌ పిలక అవతలి పార్టీల చేతిలో పెట్టినట్లే అవుతుందని అంటున్నారు.

అసలే బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతమున్న పరిస్థితులు.. ఆ పార్టీని అయోమయంలో పడేయడంతో పాటు కలవర పరుస్తున్నాయి. ఎప్పుడయితే సీఎం కేసీఆర్ తొలి జాబితా అభ్యర్థుల ప్రకటన చేశారో అప్పటి నుంచి పార్టీ వీడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. బీఆర్ఎస్ నుంచి వెళుతున్న ఏ ఒక్కరినీ వదలని కాంగ్రెస్..వారిని తమ పార్టీలో చేర్చుకుని ప్రత్యర్థి పార్టీగా బలం పుంజుకుంటుంది.

ఇలాంటి సమయంలో ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయితే..బీఆర్‌ఎస్‌కు ఈసారి ఎన్నికల్లో భారీ షాక్ తగలడం గ్యారంటీ అని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత నిర్ధోషి అని నిరూపించడానికి సీఎం కేసీఆర్ ఏ ఒక్క చిన్న అవకాశం ఉన్నా కూడా అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు.కవిత ఈ కేసులో నుంచి బయటపడితే దానినే తమ ప్రధాన ఆయుధంగా మలుచుకోవడానికి వాడుకోవడానికి కేసీఆర్ చూస్తుంటే.. కేసులో ఇరుక్కుంటే దానిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ కాచుకుని కూర్చున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + twelve =