ఇండియా మ్యాపులో శ్రీలంక..ఇంత కథ ఉందా?

India Map Sri Lanka in India map Sri Lanka map included in India map Sri Lanka country map,India Map,Sri Lanka in India map,Sri Lanka map included in India map,Sri Lanka country map,Mango News,Mango News Telugu,India, Sri Lanka map included in India, Sri Lanka country map,Sri Lanka in India map Latest News,India Map Latest Updates,India and Sri Lanka,Map of India,Sri Lanka in India map Latest Updates,Sri Lanka country map News Today

ప్రపంచంలోని మిగతా అన్ని దేశాల కంటే భారత దేశానికి మాత్రమే ప్రత్యేక ఆకారం ఉంటుంది.భారత దేశ చిత్రపటాన్ని ఒక్కసారి చూస్తే ఎవరూ కూడా అంత సులభంగా మర్చిపోలేరు. అలా ఒక ప్రత్యేక ఆకారాన్ని రూపుదిద్దుకున్న భారత దేశం.. ఇప్పుడు ప్రపంచ దేశాలతో వివిధ రంగాలతో గట్టిగా పోటీ పడుతోంది.తాజాగా జీ 20 సమావేశాల సందర్భంగా.. వివిధ దేశాధినేతలకు ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా దేశాధినేతలంతా భారత్ గురించి కొనియాడారు.

మరోవైపు కొద్ది రోజులుగా భారతదేశం మ్యాప్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. భారతదేశం పటంలో ఇండియాతో పాటు కింద శ్రీలంక కూడా కచ్చితంగా కనిపిస్తుటుంది. కానీ మిగిలిన ఏ దేశాలు కూడా కనిపించవు. శ్రీలంక దేశం మాత్రమే.. భారతదేశ పటంలో ఎందుకు చోటు సంపాదించుకుంది? దీనికి ఉన్న కారణం ఏంటన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

నిజానికి భారతదేశం, శ్రీలంకల మధ్య నిత్యం రాకపోకలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య రోడ్డు మార్గం లేకపోవడంతో కేవలం విమానం లేదా షిప్పుల ద్వారా మాత్రమే ప్రయాణాలు సాగించాల్సి ఉంటుంది. అయితే ఎంత మిత్ర దేశమైనా సరే భారతదేశపు చిత్ర పటంలో శ్రీలకం దేశానికి సంబంధించిన మ్యాప్ ఎందుకు ఉంటుందనే అనుమానాలు మాత్రం అలానే ఉండిపోతున్నాయి. భారతదేశం , శ్రీలంకల మధ్య మెరుగైన సంబంధాలు ఉన్నాయని అందరికీ అర్థమవుతూనే ఉంది. అంతేకాదు పురాణాల ప్రకారం చూసుకుంటే.. రామాయణ కాలంలో ఇండియా, శ్రీలంకల మధ్య రామసేతు నిర్మించారన్న వాదనపై ఇప్పటికీ చర్చ సాగుతూనే ఉంది. చివరకు ‘రామసేతు’ అనే సినిమా కూడా ఈ విషయం పైనే వచ్చింది.

భారతదేశపు మ్యాప్‌లో శ్రీలంక మ్యాప్ ఉండడానికి అంతర్జాతీయంగా కారణం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం తర్వాత.. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ .. ఓ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ కాన్ఫరెన్స్‌లో సముద్రానికి సంబంధించిన సరిహద్దులు, ఒప్పందాలు గురించి చర్చించి ఓ చట్టాన్ని తీసుకువచ్చారు. ఆ తరువాత 1958 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఏదైనా ఒక దేశం సముద్ర తీరాన్ని కలిగి ఉన్నప్పుడు.. ఆ దేశ సరిహద్దు చుట్టూ ఉన్న దేశాలను కూడా ఆ దేశ మ్యాప్ లో చూపించాలని నిర్ణయించారు.

ఆ దేశ సరిహద్దులోని 200 నాటికల్ మైళ్ల దూరం అంటే.. 370 కి.మీటర్లలో ఏ ప్రాంతం ఉన్నా కూడా దానిని గుర్తించి తమ దేశపు మ్యాప్‌లో చోటివ్వాలి. అలా భారతదేశానికి దక్షిణాన ఉన్న హిందూ మహా సముద్రంలో శ్రీలంక దేశం ఉంది. భారతదేశపు సరిహద్దులోని 18 మైళ్ల దూరంలో శ్రీలకం ఉంది. అందుకే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ చట్టం ప్రకారం.. శ్రీలంక మ్యాప్‌ను భారత చిత్రపటంలో తప్పనిసరిగా చూపించాలన్న మాట. ఇలా భారతదేశం దక్షిణాన ఉన్న కచ్చితంగా శ్రీలంకను చేర్చాల్సి రావడంతో.. భారతదేశపు మ్యాప్‌లో శ్రీలంక ఉంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 1 =