2020 భారత్ క్రికెట్ జట్టు షెడ్యూల్

కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో 2019 సంవత్సరంలో భారత్ క్రికెట్ జట్టు పలు సంచలన విజయాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని సిరీస్ ల నుండి అన్ని ఫార్మాట్లలో బలం పెంచుకుంటూ ప్రపంచ క్రికెట్ లో తన ఆధిపత్యాన్ని భారత్ జట్టు నిలబెట్టుకుంటుంది. ఈ ఏడాది సైతం అదే జోరును కొనసాగించి, సత్తా చాటేందుకు భారత్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. భారత్ క్రికెట్ జట్టు 2020 సంవత్సరాన్ని స్వదేశంలో శ్రీలంక సిరీస్ తో మొదలుపెట్టి, చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించడంతో ముగించనుంది.

2020 భారత్ క్రికెట్ జట్టు షెడ్యూల్:

 • జనవరి 5-10: భారత్ – శ్రీలంక: మూడు టీ 20లు (స్వదేశంలో)
 • జనవరి 14-19: భారత్ – ఆస్ట్రేలియా: మూడు వన్డేలు (స్వదేశంలో)
 • జనవరి 24-ఫిబ్రవరి 29: భారత్ – న్యూజిలాండ్‌: ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు (న్యూజిలాండ్ లో)
 • మార్చి 12-18: భారత్ – దక్షిణాఫ్రికా: మూడు టీ20లు (స్వదేశంలో)
 • ఏప్రిల్‌–మే: ఐపీఎల్‌
 • జూన్‌–జూలై: భారత్ – శ్రీలంక: మూడు వన్డేలు, మూడు టీ20లు (శ్రీలంకలో)
 • ఆగస్టు: భారత్ – జింబాబ్వే : మూడు వన్డేలు (జింబాబ్వేలో)
 • సెప్టెంబర్‌: ఆసియా కప్‌ టోర్నీ
 • సెప్టెంబర్‌–అక్టోబర్‌: భారత్‌ – ఇంగ్లాండ్: మూడు వన్డేలు, రెండు టీ20లు
 • అక్టోబర్: భారత్-ఆస్ట్రేలియా: మూడు టీ20లు (ఆస్ట్రేలియా)
 • అక్టోబర్ 18-నవంబర్ 15: ఆస్ట్రేలియాలో టీ 20 ప్రపంచ కప్
 • నవంబర్ –జనవరి 2021: భారత్ – ఆస్ట్రేలియా: 3 వన్డేలు, 4 టెస్టులు (ఆస్ట్రేలియా)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − seven =