కరోనాతో అనాథలైన పిల్లలకు పీఎం కేర్స్ ద్వారా సాయం, రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్

free education for Covid orphans, Free Education for Kids who Lost Parents to Covid-19, Mango News, PM announces aid, PM Cares for Children free education, PM CARES Fund, PM Cares to pay for education care of children orphaned, PM Modi, PM Modi Announces Rs 10 Lakh Fixed Deposit, PM-CARES Children Scheme, PM-CARES For Children, PM-CARES For Children Scheme, Rs 10 Lakh Fixed Deposit Free Education for Kids who Lost Parents to Covid-19

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మద్దతు ఇవ్వడానికి తీసుకోవలసిన చర్యలపై శుక్రవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను లేదా చట్టపరమైన సంరక్షకులు/దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రెన్​ పథకం ద్వారా సాయం అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.

కరోనా ద్వారా అనాథ‌ల‌యిన‌ పిల్లలకు 18 సంవత్సరాలు నిండినప్పుడు ప్రత్యేకంగా రూపొందించిన పథకం ద్వారా 10 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడానికి పీఎం కేర్స్ సహాయపడుతుందని చెప్పారు. 18 సంవత్సరాల వయస్సు నుండి నెలవారీ ఆర్థిక సహాయం/స్టైఫండ్ పొందేందుకు ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉపయోగించబడుతుందని, 18 నుంచి 23 సంవత్సరాల వరకు ఐదేళ్లల్లో ఉన్నత విద్య కాలంలో వారి వ్యక్తిగత అవసరాలను చూసుకోవటానికి ఈ స్టైపండ్ ఉపయోగించుకోవచ్చని చెప్పారు. 23 సంవత్సరాల వయస్సుకు చేరుకున్నప్పుడు వారు రూ.10 లక్షలను వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అవసరాల కోసం విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పారు.

10 సంవత్సరాలలోపు పిల్లలకు పాఠశాల విద్యలో భాగంగా సమీప కేంద్రీయ విద్యాలయంలో లేదా ఒక ప్రైవేట్ పాఠశాలలో డే స్కాలర్ గా ప్రవేశం ఇవ్వబడుతుందని చెప్పారు. పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్పించినట్లయితే ఆర్టీఈ నిబంధనల ప్రకారం ఫీజులు పీఎం కేర్స్ నుండి ఇవ్వబడతాయని చెప్పారు. యూనిఫాం, టెక్స్ట్ బుక్స్ మరియు నోట్ బుక్స్ ఖర్చులకు కూడా పీఎం కేర్స్ చెల్లిస్తుందని చెప్పారు.

ఇక 11-18 సంవత్సరాల మధ్య పిల్లలకు పాఠశాల విద్య కోసం సైనిక్ స్కూల్, నవోదయ విద్యాలయ వంటి కేంద్ర ప్రభుత్వ రెసిడెన్సియల్ పాఠశాలల్లో ప్రవేశం ఇవ్వబడుతుందని చెప్పారు. ఒకవేళ పిల్లలు యొక్క గార్డియన్/తాతలు/ సమీప కుటుంబాలు వారు సంరక్షణలో పిల్లలను ఉంచుకోవాలంటే, ఆ పిల్లలకు సమీప కేంద్రీయ విద్యాలయంలో లేదా ప్రైవేట్ పాఠశాలలో రోజు డే స్కాలర్ గా ప్రవేశం ఇవ్వబడుతుందని చెప్పారు. ఈ కేటగిలో పిల్లవాడిని ప్రైవేట్ పాఠశాలలో చేర్పించినట్లయితే, ఆర్టీఈ నిబంధనల ప్రకారం ఫీజులు పీఎం కేర్స్ నుండి ఇవ్వబడతాయని, అలాగే యూనిఫాం, టెక్స్ట్ బుక్స్ మరియు నోట్ బుక్స్ ఖర్చు కూడా పీఎం కేర్స్ చెల్లిస్తుందని చెప్పారు.

ఇక ఆ పిల్లలకు ఉన్నత విద్యకు కూడా మద్దతు తెలుపబడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న విద్యా రుణ నిబంధనల ప్రకారం దేశంలో ప్రొఫెషనల్ కోర్సులు/ఉన్నత విద్యకు విద్యా రుణం పొందడంలో పిల్లలకి సహాయం చేయబడుతుందని, ఈ రుణంపై వడ్డీని పీఎం కేర్స్ చెల్లిస్తుందని తెలిపారు. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్/ఒకేషనల్ కోర్సులకు ట్యూషన్ ఫీజు/కోర్సు ఫీజులకు సమానమైన స్కాలర్‌షిప్ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద అందించబడుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న స్కాలర్‌షిప్ పథకాల కింద అర్హత లేని పిల్లలకు, పీఎం కేర్స్ సమానమైన స్కాలర్‌షిప్‌ను అందిస్తుందని చెప్పారు.

మరోవైపు పిల్లలకు ఆరోగ్య భీమా కూడా కల్పించబడుతుందని తెలిపారు. పిల్లలందరూ ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ. 5 లక్షల విలువైన ఆరోగ్య బీమాకు నమోదు చేయబడతారని, 18 సంవత్సరాల వయస్సు వరకు ప్రీమియం మొత్తాన్ని పీఎం కేర్స్ చెల్లిస్తుందని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =