ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన 1000 కోట్లు కేంద్రం వెంటనే ఇవ్వాలి

5th Employment Guarantee Council Meeting Telangana, 5th Telangana Employment Guarantee Council Meeting, 5th Telangana State Employment Guarantee Council Meeting, Employment Guarantee Council, Employment Guarantee Council Meeting, telangana, Telangana Employment Guarantee Council, Telangana Employment Guarantee Council Meeting, Telangana News, Telangana Political Updates

మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం నుంచి రావాల్సిన వెయ్యి కోట్ల నిధుల‌ను వెంట‌నే ఇవ్వాల‌ని, అలాగే ఉపాధి హామీ ప‌థ‌కాన్ని వ్య‌వ‌సాయానికి అనుసంధానించాల‌ని తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ తీర్మానించింది. 5వ తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ సమావేశం గురువారం నాడు హైద‌రాబాద్ లోని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కార్యాల‌యంలో ఆయ‌న అధ్య‌క్ష‌త‌న‌ జ‌రిగింది. ఈ కౌన్సిల్ స‌భ్యులైన రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, గిరిజ‌న సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ‌శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్, కార్మిక‌శాఖ మంత్రి మ‌ల్లారెడ్డిలు ఈ సమావేశానికి హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, దేశంలో ఉపాధి హామీ చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని విధంగా ప‌ని దినాల‌ను నిరుపేద‌ల‌కు ఉపాధిని క‌ల్పించ‌లిగామ‌న్నారు. ప్ర‌త్యేకించి క‌రోనా వైర‌స్ వ్యాప్తి‌, లాక్ డౌన్ స‌మ‌యంలో కేవ‌లం 15 రోజుల్లోనే 25ల‌క్ష‌ల మందికి ఉపాధి క‌ల్పించాం. ఇది జాతీయ రికార్డని అన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా ఉపాధి క‌ల్ప‌న‌తోపాటు, నిరుపేద‌ల ఆర్థిక స్థాయిని కూడా పెంచ‌గ‌లిగామ‌ని తెలిపారు. మ‌న తెలంగాణ రాష్ట్రంలో 29.23 కుటుంబాల‌కు ఉపాధిని క‌ల్పించామ‌ని, ఇది దేశంలోనే రికార్డు అని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ప్ర‌తి ఏడాది 3వేల కోట్ల రూపాయ‌ల ప‌నులు మ‌న రాష్ట్రంలో జ‌రిగాయ‌న్నారు. గ‌తంలో ఉపాధి హామీ ప‌నులంటే అంత‌గా అభివృద్ధి క‌నిపించేది కాద‌న్నారు. కానీ, తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంతో, ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ఉపాధి హామీని అనుసంధానించామ‌ని మంత్రి తెలిపారు.

న‌ర్స‌రీలు, మొక్క‌ల పెంప‌కం, చెరువుల పూడిక‌తీత‌, ఇంకుడుగుంత‌లు, సిసి రోడ్లు, గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాలు, వైకుంఠ దామాలు, ప్ర‌కృతి వ‌నాలు, డంపు యార్డులు, క‌ల్లాలు, రైతు వేదిక‌లు వంటి వెన్నో నిర్మిస్తున్నామ‌ని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఇంకుడు గుంత‌ల్లోనూ మ‌న రాష్ట్రం దేశంలో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింద‌న్నారు. నిర్ణీత కాలానికి ముందే ఉపాధి హామీ ప‌నుల‌న్నీ పూర్తి చేసి, కొత్త‌గా మ‌రిన్నినిధుల కోసం నిధుల‌ను కేంద్రాన్ని అడిగిన రాష్ట్రం కూడా మ‌న‌దేన‌న్నారు. ఇన్ని విధాలుగా దేశంలో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్ర‌బెల్లి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే కింది స్థాయిలో ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌త్యేకించి స‌ర్పంచ్ లు, గ్రామ కార్య‌ద‌ర్శుల‌ను మంత్రి అభినందించారు. అలాగే నిర్ణీత ల‌క్ష్యాల‌క‌నుగుణంగా ప‌ని చేస్తున్న పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిష‌న‌ర్ ర‌ఘునంద‌న్ రావు, ఉపాధి హామీ అధికారులు అంద‌రినీ మంత్రి అభినందించారు. అలాగే రానున్న రోజుల్లో మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేయాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు.

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ, క‌మిట్ మెంట్ తో ప‌ని జ‌రుగుతున్న‌ది. గ్రామాల్లో ప‌చ్చ‌ద‌నం ప‌రుచుకుంటున్న‌ది. సీజ‌న‌ల్ వ్యాధులు త‌గ్గాయి. గ్రామ పంచాయ‌తీల‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా ప్ర‌తి నెలా రూ.308 కోట్లు విడుద‌ల చేస్తుండ‌టంతో ప‌నులు జ‌రుగుతున్నాయి. ప‌ల్లెప్ర‌కృతి వ‌నాలు అద్భుతంగా ఉన్నాయి. సిసి రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణ‌మ‌వుతున్నాయి. మా ఆదిలాబాద్ జిల్లాకు మ‌రిన్ని నిధులు అందేలా చూడండి అని అన్నారు. మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మాట్లాడుతూ, స్వ‌చ్ఛ అవార్డులు తీసుకుంటున్న మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, వారి టీమ్ కి అభినంద‌న‌లు తెలిపారు. ఉపాధి హామీ ప‌నులు అద్భుతంగా సాగుతున్నాయి. గ్రామాల రూపురేఖ‌లు మారాయి. స‌మ‌ర్థ‌వంతంగా ప‌నులు జ‌రుగుతున్నాయి. పంచాయ‌తీరాజ్ డిపార్ట్ మెంట్ నుంచి గిరిజ‌న సంక్షేమానికి రావాల్సిన నిధుల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా అందించాలి. ఇంకా 12వేల అంగ‌న్ వాడీల‌కు సొంత భ‌వ‌నాలు లేవు. కిరాయిలు కోట్ల రూపాయ‌లు క‌డుతున్నాం. ఇందుకు బ‌దులుగా ఉపాధి హామీ ప‌థ‌కం కింద అంగ‌న్ వాడీ కేంద్రాల నిర్మాణానికి కృషి చేయండి. రెండు మూడేండ్లు నిధులు కేటాయిస్తే, భ‌వ‌నాలు పూర్త‌వుతాయి. అని చెప్పారు.

మంత్రి మ‌ల్లారెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా నిలిచిన ఉపాధి హామీని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తిస్తున్న మంత్రి ఎర్ర‌బెల్లికి, సంబంధిత శాఖ టీమ్ కి అభినంద‌న‌లు తెలిపారు. వ్య‌వ‌సాయ రంగానికి కూడా ఉపాధి హామీని అనుసంధానించే ప‌నిని పూర్తి చేయండి. త‌ద్వారా ఇంకా ఈ ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అవుతుంది, అభివృద్ధీ జ‌రుగుతుందని తెలిపారు. ఈ స‌మావేశంలో కౌన్సిల్ రెండు తీర్మానాల‌ను చేసింది. రాష్ట్రానికి రావాల్సిన రూ.వెయ్యి కోట్ల ఉపాధి నిధిని వెంట‌నే కేంద్రం ఇవ్వాల‌ని, అలాగే ఉపాధి హామీ ప‌థ‌కాన్ని వ్య‌వ‌సాయ ప‌నుల‌ను అనుసంధానించాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టగా స‌మావేశం ఏక‌గ్రీవంగా ఆమోదించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =