నేడు మంచిర్యాలలో టీ-కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్

AICC Chief Mallikarjun Kharge and Rajasthan CM Ashok Gehlot To Attend For T-Congress Public Meeting in Mancherial Today,AICC Chief Mallikarjun Kharge,Rajasthan CM Ashok Gehlot,AICC Chief To Attend For T-Congress Public Meeting,T-Congress Public Meeting in Mancherial Today,Mango News,Mango News Telugu,Bhongir MP urges people,Congress plans massive public meeting,Congress To Hold Public Meeting,Mancherial District,Mancherial District Latest News,AICC Chief Mallikarjun News Today,Rajasthan CM Ashok Gehlot Live News,T-Congress Public Meeting Live News

తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాలలో భారీ బహిరంగ సభ జరుగనుంది. గత కొన్ని రోజులుగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ కార్యక్రమం నేడు నిర్వహించడానికి పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో గల కొత్త కలెక్టరేట్ సమీపంలో 22 ఎకరాల సువిశాల స్థలంలో నేడు దీనిని నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో దీనిని నిర్వహించనున్నట్లు టీ-కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. సభ ప్రాంగణానికి ‘బాబా సాహెబ్ అంబేడ్కర్’ అని నామకరణం చేసినట్లు వెల్లడించాయి. మరోవైపు రాహుల్ గాంధీకి మద్దతుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర నేడు మంచిర్యాల చేరుకోనుంది.

ఇక సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవనున్న ఈ భారీ బహిరంగ సభకు అఖిల భారత్‌ కాంగ్రెస్‌ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు హాజరవనున్నారు. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్, సీనియర్ నేత కొప్పుల రాజు సహా పలువురు జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. కాగా మల్లికార్జున్ ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో తొలిసారి హాజరవుతున్న భారీ బహిరంగ సభ కావడంతో మంచిర్యాల సభను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − six =