పబ్లిక్ గార్డెన్ లో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్

CS Somesh Kumar Inspects Arrangements for State Formation Day Celebrations at Public Gardens, Somesh Kumar Inspects Arrangements for State Formation Day Celebrations at Public Gardens, Telangana CS Somesh Kumar Inspects Arrangements for State Formation Day Celebrations at Public Gardens, Telangana Chief Secretary Inspects Arrangements for State Formation Day Celebrations at Public Gardens, State Formation Day Celebrations at Public Gardens, Public Gardens, State Formation Day Celebrations, TS State Formation Day Celebrations, Telangana State Formation Day Celebrations, Telangana Chief Secretary Somesh Kumar, Telangana CS Somesh Kumar, CS Somesh Kumar, IAS Somesh Kumar, TS State Formation Day Celebrations News, TS State Formation Day Celebrations Latest News, TS State Formation Day Celebrations Latest Updates, TS State Formation Day Celebrations Updates, Mango News, Mango News Telugu,

జూన్ 2వ తేదిన నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేశ్ కుమార్ మంగళవారం స్వయంగా పరిశీలించారు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో జరగనున్న ఈ వేడుకలకు సంబంధించి పూర్తి డ్రెస్ రిహార్సల్‌ను కూడా సీఎస్ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 2న పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ముందుగా గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్ కు చేరుకొని పోలీస్ దళాల వందనం స్వీకరిస్తారని తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగం ఉంటుందని చెప్పారు.

ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి రిహార్సల్ ను సీఎస్ నేడు పరిశీలించారు. కోవిడ్ కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సీఎస్ తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పొలిటికల్ కార్యదర్శి శేషాద్రి, జీహెఛ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హెఛ్ఎండబ్ల్యూఎస్ఎస్ అండ్ బి ఎండీ దానకిషోర్, ప్రొటోకాల్‌ అడిషనల్ సెక్రటరి అరవిందర్ సింగ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత విభాగ అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =