తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై అపెక్స్‌ కౌన్సిల్ సమావేశం ప్రారంభం

AP And TS Over Water Allocation Issues, AP TG Water Project Dispute, Apex Council Meeting, Apex Council Meeting Between AP And TS, Apex Council Meeting Between AP And TS Over Water Project Dispute, Apex Council meeting between Telangana and Andhra, Apex Council Meeting Between Telugu States, Water Project Dispute

తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నది జలాల వినియోగానికి సంబంధించిన వివాదాలపై చర్చించేందుకు ఈ రోజు అపెక్స్ కౌన్సిల్ భేటీ జరుగుతుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. హైద‌రాబాద్ నుంచి అధికారులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాల్గొనగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్కడి నుంచే అధికారులతో కలిసి అపెక్స్ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్నారు. నీటి కేటాయింపులు, జలవివాదాలు, ప్రాజెక్టులకు అనుమతి వంటి అంశాలపై తమ వాదనలు వినిపించేందుకు రెండు రాష్ట్రాలు పూర్తి సమాచారంతో సిద్దమయినట్టుగా తెలుస్తుంది. సమావేశ ఎజెండాలో పేర్కొన్న అంశాలతో పాటుగా, ఇతర సంబంధిత అంశాలపై కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ భేటీలో చర్చలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 17 =