తెలంగాణాలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంతో ఈ అంశం ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది. పేపర్ లీకేజీ వెనుక సూత్రధారి సంజయ్ అని పేర్కొంటూ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దీని వెనుక మరికొందరు ఉన్నారని వరంగల్ సీపీ రంగనాథ్ ప్రకటించడం మరింత ఉత్కంఠ రేకేతించింది. ఈ నేపథ్యంలో గురువారం హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరియు ఆయన పీఏలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో నిందితుడు ప్రశాంత్ వాట్సాప్‌లో క్వశ్చన్ పేపర్‌ను ఎమ్మెల్యేకు పంపినట్లు గుర్తించామని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శుక్రవారం దీనిపై మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు.. ‘నేను టెక్నాలజీకి అప్ డేట్ కాలేద. సహజంగా నా ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లకు రిప్లై ఇవ్వను. ఎవరో ఒక వ్యక్తి వాట్సాప్ చేస్తే.. దానిని నేను చూడకపోయినా నోటీసులు ఇచ్చారు. కేవలం నన్ను వేధించడానికే నోటీసులు ఇచ్చారు. సంబంధం లేకపోయిప్పటికీ నోటీసు ఇవ్వడాన్ని ఖండిస్తున్నాను. నోటీసులకు, జైళ్లకు భయపడేది లేదు. అయితే చట్టం మీద గౌరవం ఉంద కాబట్టి నోటీసులపై వివరణ ఇస్తా. సీఎం కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులపై పోలీసులను ప్రయోగిస్తున్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు’ అని తెలిపారు.
అలాగే ప్రధాని పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునివ్వడంపై ఎమ్మెల్యే రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ వచ్చేనాటికి 63 వేల మంది ఉద్యోగులతో ఉన్న సింగరేణి, ఇప్పుడు 43 వేల మంది ఉద్యోగులకు ఎందుకు పడిపోయింది? సింగరేణి ఎందుకు రూ.10వేల కోట్లు అప్పుల పాలైంది? అని ప్రశ్నించారు. ఇక 55 మిలియన్ టన్నుల నుంచి 65 మిలియన్ టన్నులకు బొగ్గు ఉత్పత్తి పెరిగిందని, అయితే సంస్థలో ఉద్యోగులు మాత్రం 20వేల మందివరకు తగ్గారని తెలిపారు. సింగరేణి కంపెనీని ఏఎంఆర్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని, దీని వెనుక ఎవరు ఉన్నారో సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికీ తెలుసని వ్యాఖ్యానించారు. 90 శాతం పనులు ప్రైవేటు కార్మికులకు అప్పగిస్తున్నారని, కోల్ ఇండియాలో ఒక్కో కార్మికుడికి 900లకు పైగా ఇస్తుండగా.. సింగరేణి కార్మికులకు మాత్రం కేవలం రూ.430లు ఇచ్చి వారి శ్రమను దోచుకుంటున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE