ఉద్యోగుల పరస్పర బదిలీలకు ఈ నెల 15 లోగా దరఖాస్తు చేసుకోవాలి: సీఎస్ సోమేశ్ కుమార్

Telangana CS Somesh Kumar Says Employees Need to Apply for Mutual Transfers Before March 15th, CS Somesh Kumar Says Employees Need to Apply for Mutual Transfers Before March 15th, Telangana CS Somesh Kumar Says Employees Need to Apply for Mutual Transfers, Mutual Transfers, Telangana CS Somesh Kumar, Telangana CS, Somesh Kumar, CS Somesh Kumar, Telangana, Telangana Chief Secretary, Chief Secretary, Chief Secretary Somesh Kumar, Chief Secretary Somesh Kumar Says Employees Need to Apply for Mutual Transfers Before March 15th, Mutual Transfers Before March 15th, Employees Need to Apply for Mutual Transfers, Telangana Latest News, Telangana Latest Updates, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో ఉద్యోగుల పరస్పర బదిలీలకు గాను ఈ నెల 15 తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ బదిలీలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో సీనియారిటీ ప్రొటెక్షన్ ను కల్పించడం జరుగుతుందని సీఎస్ స్పష్టం చేశారు. ఈ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ఫిబ్రవరి 2న జీ.వో.ఎం.ఎస్. నెంబర్ 21 విడుదల చేయడం జరిగిందని, ఈ జీవోలోని పారా 7 మరియు 8 పారాల్లో పేర్కొన్న నిబంధనలను మార్పులు చేస్తూ ప్రభుత్వం జీ.ఓ. ఆర్.టి నెం.402 పేరుతో ఫిబ్రవరి 19న ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు.

తద్వారా ఉమ్మడి జిల్లా క్యాడర్ కు చెందిన ఇద్దరు ఉద్యోగులు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకున్నట్టయితే, వారి సీనియారిటీకి కొత్త లోకల్ కేడర్ లో కూడా రక్షణ ఉంటుందని వివరించారు. ఈ బదిలీలకై దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా ఈ నెల 15 తేదీలోగా సమర్పించాలని అన్నారు. ఇప్పటి వరకు పరస్పర బదిలీలకై 31 దరఖాస్తులు అందాయని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + one =