ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి అస్వస్థత.. చెన్నైకి తరలించడానికి ఏర్పాట్లు

Udayagiri MLA Mekapati Chandrasekhar Reddy Falls Sick Once Again,Udayagiri MLA Mekapati Falls Sick,Mekapati Chandrasekhar Reddy Falls Sick,Mekapati Falls Sick Once Again,Mango News,Mango News Telugu,Udayagiri MLA Latest News,MLA Mekapati Chandrasekhar Latest News,MLA Mekapati Chandrasekhar Latest Updates,Udayagiri YSRCP Leaders Sensational Comments,MLA Mekapati Vikram Reddy Strong Counter,MLA Mekapati Chandrasekhar Reddy falls ill,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం మర్రిపాడులోని తన నివాసంలో ఉన్న సమయంలో గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే వైద్యులకు సమాచారం అందించి ఇంటివద్దే ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి కొన్ని వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. షుగర్, బీపీ లెవెల్స్ ఆందోళనకరంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు కుటుంబ సభ్యులు ఆయనను చెన్నై తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా గత నెలలో కూడా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో గుండెలోని రెండు వాల్వులు బ్లాక్ అయినట్లు గుర్తించిన వైద్యులు అత్యవసర చికిత్స అందించడంతో కోలుకున్నారు.

ఇక తాజాగా ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేశారనే ఆరోపణలతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని సస్పండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉదయగిరి వైసీపీ నేతలకు, ఎమ్మెల్యే మేకపాటికి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఎమ్మెల్యేకు దమ్ముంటే ఉదయగిరిలో అడుగు పెట్టాలంటూ వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి చేసిన సవాల్ కు స్పందించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉదయగిరి బస్టాండ్ సెంటర్ లో నడిరోడ్డుపై కుర్చి వేసుకుని కూర్చుని ఎవరు వస్తారో రావాలని ప్రతి సవాల్ విసిరారు. దీంతో తాము లేనప్పుడు రావడం కాదని, ఈరోజు రావాలని వైసీపీ నేతలు మళ్ళీ సవాల్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మర్రిపాడులో ఉన్న ఎమ్మెల్యే మేకపాటి ఇంటికి మీడియా వెళ్లి ప్రశ్నించగా.. ప్రస్తుతం తనకు ఆరోగ్యం సరిగా లేదని, ఇప్పుడు రాజకీయాలు సరికాదని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here