మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఖరారు చేస్తూ బీజేపీ అధికారిక ప్రకటన

BJP Officially Announces Komatireddy Rajgopal Reddy as Party Candidate for Munugode Bye-election, BJP Komatireddy Rajgopal Reddy as Party Candidate, BJP Komatireddy Rajgopal Reddy Munugode By-election, Komatireddy Rajgopal Reddy, Mango News, Mango News Telugu, BJP Officially Announces Komatireddy Rajgopal Reddy, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode By-poll

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక 2022, నవంబర్ 3న జరగనుంది. ఈ ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా అక్టోబర్ 7 నుంచే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నికలో పోటీచేసే అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖరారు చేసింది. మునుగోడు అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఖరారు చేస్తూ బీజేపీ శనివారం అధికారికంగా ప్రకటించింది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్టోబర్ 10, సోమవారం తన నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలుస్తుంది.

ముందుగా ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నికకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మునుగోడులో నవంబర్ 3వ తేదీన పోలింగ్ నిర్వహించి, నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీలో ఉన్నారు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 6 =