ఏపీలో అకాల వర్షాలపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు

CM Jagan Held Review on Rains in AP Orders Officials For Enumeration Report Farmers Crop Damage,CM Jagan Held Review on Rains,AP Orders Officials For Enumeration Report,CM Jagan Review on Farmers Crop Damage,Mango News,Mango News Telugu,CM Jagan Orders Quick Relief For Farmers,Andhra Pradesh farmers stare at huge losses,CM Jagan Reviews On Unseasonal Rains,Andhra Pradesh CM Jagan Mohan Reddy,YS Jagan directs officials on crop damage,CM Jagan Latest News and Updates,Andhra Pradesh CM Jagan Live News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ మొదలు పెట్టాలని, ఒక వారం రోజుల్లోగా దీనికి సంబంధించిన రిపోర్టును సమర్పించాలని సూచించారు. వారం రోజుల్లో ఈ ఎన్యుమరేషన్‌ పూర్తిచేయాల్సిందిగా కలెక్టర్లును ఆదేశించిన సీఎం జగన్, ఈ రిపోర్టుల ఆధారంగా రైతులకు సహాయపడేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే భారీ వర్షాల వల్ల ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం జగన్ కలెక్టర్లును ఆదేశించారు.

కాగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి జార్ఖండ్‌ వరకు.. రాయలసీమ, తెలంగాణ, ఒడిశాల మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వరకు కొనసాగుతున్న ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంగా పలు ప్రాంతాల్లో పిడుగులు భీభత్సం సృష్టిస్తుండగా.. వడగళ్లు వానలతో ప్రజలు భీతిల్లుతున్నారు. సోమవారం కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఆదివా­రం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు­గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =